Peddapalli: గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 28 , 2026 | 12:20 AM
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన జోరువానకు.. వీచిన గాలు లకు సుల్తానాబాద్ పట్టణంలోని పలుచోట్ల షెడ్లు కూలిపోయాయి.
విరిగిన విద్యుత్ స్థంభాలు
కూలిన ఇళ్లు, పడిపోయిన చెట్లు
సుల్తానాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన జోరువానకు.. వీచిన గాలు లకు సుల్తానాబాద్ పట్టణంలోని పలుచోట్ల షెడ్లు కూలిపోయాయి. పూసాలలో పశువుల కొట్టం ధ్వంసం అయింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ వైర్లు తెగిపోయి చాలాసేపు సరఫరా నిలిచిపోయింది. నీరు కుళ్ల గ్రామ పంచాయతీ పక్కనఉన్న సొసైటీకి చెందిన పెట్రోల్‌బంకు వద్ద విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, రేకుల షెడ్డు కూలిపోయింది. పూసాలలో జరిగిన నష్టాన్ని, అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ బుధవారం ఉదయం పరిశీ లించి సహాయక చర్యలకు అదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంత తడిసిపోయింది.
ఎలిగేడు : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన యువరైతు బాసంపల్లి వినోద్‌కు చెందిన పశువులషెడ్డు పూర్తిగా నేలమట్ట మైంది. రేకులు పక్కనే ఉన్న హార్వెస్టర్‌పై పడ టంతో పూర్తిగా దెబ్బ తిన్నది. సుమారు రూ.1.30లక్షల నష్టం వాటిల్లిందని రైతువినోద్ వాపోయాడు.
ఫ ఎలిగేడులో విద్యుత్‌శాఖకు
రూ.1.50 లక్షలకుపైగా నష్టం
ఎలిగేడు : మండలంలో విద్యుత్‌శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ డీపీలకు నష్టం సంభవించినట్లు మండల విద్యుత్‌అధికారి సంపత్‌రెడ్డి తెలిపారు. బుర్హాన్ మియాపేటలో ఆరు ఎల్‌టీ విద్యుత్‌స్తంభాలు విరిగి పోగా, ర్యాకల్‌దేవుపల్లిలో రెండు ట్రాన్స్‌ఫార్మర్ల డీపీలకు నష్టం జరిగింది. అందులో ఒక ట్రాన్స్‌ఫార్మర్ డీపీ పూర్తిగా దెబ్బతినగా, మరొకటి పగిలిపోయినట్లు తెలి పారు. ముప్పిరితోటలో రెండు ఎల్‌టీ స్తంభాలు విరిగి పోయాయి. ఈ ఘటనలతో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌శాఖకు రూ.1.50లక్షలకుపైగా నష్టం సంభవించినట్లు మండల విద్యుత్‌శాఖ అధికారి సంపత్ రెడ్డి పేర్కొన్నారు.
ఓదెల : మండలంలోని చిన్నకొమిరలో సామాని మహేందర్‌కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిలోని బియ్యం,దుస్తులు తడిసిపోగా, ఇంటిలో ఉన్న ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. ఇందుర్తిలో కలెవేని కొమురయ్య, తోడేటి రాజమల్లుతోపాటు మరో ఇద్దరు రైతులకు చెందిన ఇండ్ల పైకప్పులు చెదిరిపోవడంతో కుటుంబాలు రాత్రి వర్షంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాయి.