Peddapalli: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:25 AM
సుల్తానాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను అదేశించారు.
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను అదేశించారు. సుల్తానాబాద్ మండలంలోని బొంత కుంటపల్లి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయిల్‌పామ్ పంటసాగు, దిగుబ డులు, మార్కెటింగ్ వంటి అంశాల గురించి రైతు లతో, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంట సాగు ద్వారా రైతులకు వచ్చే ఆదాయం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల న్నారు. ప్రస్తుతం జిల్లాలో 3600ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారని, దీన్ని మరింత విస్తరించడం కోసం అధికారులు చర్యలు చేపట్టాల న్నారు. జిల్లాలో మొదటి ఏడాది 1253ఎకరాలలో సాగుచేయగా దీనికి సంబంధించిన గెలలు కోతకు కూడా వచ్చాయని దిగుబడులు బాగా వచ్చి రైతు లకు లాభదాయకంగా ఉందన్నారు. ముత్తారం, శ్రీరాంపూర్, ధర్మారం వంటి కొన్ని మండలాల్లో కటింగ్ కూడా జరుగుతున్నాయన్నారు. రైతులకు మూడు నాలుగు రోజుల్లోనే డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం పదిలక్షల ఎకరాలు ఉండగా పెద్దపల్లి జిల్లాలో 45వేల ఎకరాలలో సాగు చేయలానే లక్ష్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం టన్ను ధర 21వేల546రూపాయలు పలుకుతోందన్నారు. సబ్సిడీలు కూడా అధికంగా ఉన్నందున రైతులు సాగుపట్ల ఆసక్తిచూపాలన్నారు. బొంతకుంటపల్లి గ్రామంలో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వేసిన కోకోపంటను కలెక్టర్ పరిశీలించారు. సుల్తానా బాద్ మండలంలో 350 ఎకరాలలో సాగు చేస్తున్నట్లు తెలిపారు.
ఫ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని
వేగవంతం చేయాలి..
మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. మండ లంలోని బొంతకుంటపల్లి గ్రామంలో పలువురు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. బిల్లులు సకాలంలో వస్తున్నాయా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు తదితరులు ఉన్నారు.