Peddapalli: ఎస్‌జీఎఫ్ క్రీడలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:19 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరే షన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది.
- ఆగస్టు31 లోపు మండల, జోనల్‌స్థాయి పోటీలు
- సెప్టెంబరు15 లోపు జిల్లాస్థాయి పోటీలు
- ప్రతిభ ఆధారంగానే క్రీడాకారుల ఎంపిక
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరే షన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది. 2026-27విద్యాసంవత్సరానికి జిల్లాలోని అన్నిమండలాల్లో అండర్-14,-17విభాగంలో బాలబా లికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్, హాకీ, ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్, బ్యాడ్మింటన్ క్రీడలతోపాటు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిం చారు. ప్రతి మండలంలో మండల విద్యాధికారుల ఆధ్వర్యంలో పీడీలు, పీఈటీలు సమావేశమై మండ లస్థాయి పోటీలను నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయాలని సూచించారు.
ఫ మండల, జోనల్ స్థాయి పోటీలు..
మండల, జోనల్‌స్థాయి పోటీలను ఆగస్టు31లోపు పూర్తిచేయాలని నిర్ణయించారు. జిల్లాస్థాయి పోటీ లను సెప్టెంబరు15లోపు, రాష్ట్రస్థాయి పోటీలను అక్టోబరు10లోపు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర స్థాయి ఇంటర్‌డిస్ట్రిక్ట్ పోటీల నిర్వ హణకు సంబంధించిన ప్రతి పాద నలను జిల్లావిద్యాశాఖ అధికారి అనుమతితో ఆగస్టు14లోపు సిద్ధం చేసి, ఆగస్టు 17న హైదరాబాద్‌లో నిర్వహించే ఎస్‌జీఎఫ్ సమావేశా నికి సమర్పించనున్నారు. క్రీడాకా రుల ఎంపికలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించే విధంగా చర్యలు చేపడు తున్నారు. ప్రతిక్రీడలో నైపుణ్యం, ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరిగే విధంగా చూడనున్నారు. పీడీలు, పీఈటీలు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు సమన్వయంతో సెలక్షన్లు నిర్వహించనున్నారు.
ఫ క్రీడలతో
ఎన్నో ప్రయోజనాలు..
క్రీడలు విద్యార్థుల్లో క్రమ శిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమిష్టి భావనను పెంపొందిస్తాయి. ఓటమిని స్వీకరించి తిరిగి విజయాన్ని సాధించే మనస్తత్వాన్ని క్రీడలు నేర్పుతాయి. అందుకే ప్రతి విద్యార్థికి తన ప్రతిభను నిరూపించుకునే సమాన అవకాశం కల్పించడమే ఎస్‌జీఎఫ్ ప్రధాన ఉద్ధేశం. చిన్న గ్రామం నుంచి వచ్చిన ప్రతిభావంతుడైన విద్యార్థి రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగడానికి ఈ పోటీలు దోహదపడ నున్నాయి.
గెలిచిన వారికే కాకుండా పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలు జీవితాంతం తోడుంటాయి.