Share News

Peddapalli: యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:42 AM

మంథని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

Peddapalli: యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం కలెక్టర్‌ మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గంగాపురి ప్రాం తంలో ఉన్న ప్రభుత్వస్థలాన్ని, గౌతమినగర్‌లోని మండ లపరిషత్‌ ప్రాథమిక పాఠశాలను, టాస్క్‌ భవనాన్ని పరిశీలించి అధికారులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేకకార్యాచరణలో భాగంగా టీజీఐఐసీ సంస్థ ఆధ్వర్యంలో గార్మెట్‌ యూనిట్లు ఏర్పాటు చేసేం దుకు వీలుగా 2ఎకరాలు కేటాయించేందుకు పకడ్బం దీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.టాస్క్‌ సెంటర్‌ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో మంచిశిక్షణ అందించేందుకు వీలుగా మంథనిలో సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన పక్షంలో మరో భవనానికి కూడా విస్తరించేందుకు చర్యలు తీసు కోవాలని అన్నారు. ఆయనవెంట ఆర్డీవో సురేష్‌, తహ సీల్దార్‌ ఆరిఫోద్దిన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ ఉన్నారు.

గ్రామాల అభివృద్ధికి

సమన్వయంతో పనిచేయాలి..

పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం సమ న్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికా రులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణ అమలుపై ఎంపీడీవోలతో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈసందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఈకార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కట్టుదిట్టంగా అమ లు చేయాలన్నారు. మార్చి6 నుంచి 16వరకు పెండింగ్‌లో ఉన్నఫైళ్లను క్లియర్‌ చేయా లని సూచించారు. ఏప్రిల్‌ 2న నిర్వహించే గ్రామస్థాయి సమావేశానికి ముందే అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని, పారిశుధ్యం,పచ్చదనం పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టంచేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆ ర్డీవో కాళిందిని, హౌసింగ్‌ ఈఈ రాజేశ్వర్‌, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతవిద్య చదవాలి..

పెద్దపల్లి కల్చరల్‌ : ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నతవిద్యను కొనసాగించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ప్రవేశా లకు సంబంధించిన పోస్టర్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీప్రభుత్వకళాశాలలో నాణ్య మైనవిద్యతోపాటు డిజిటల్‌లైబ్రరీ, నిష్ణాతులైన అధ్యా పకులు ఉంటారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాల ప్రవేశాల ప్రచార కార్యక్ర మాలు, కౌన్సిలింగ్‌, సమావేశాలు, ప్రచారపత్రాల పంపిణీ కొనసాగించా లని కలెక్టర్‌ ప్రిన్సిపాల్‌కు సూచిం చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మినర్సయ్య, అధ్యాపకులు సతీష్‌కుమార్‌, పురుషోత్తం, మారుతి, మురళి, షుకూర్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:42 AM