Share News

Peddapalli: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - May 14 , 2026 | 11:47 PM

పెద్దపల్లి టౌన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకదృష్టి సారించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా సూచిం చారు. గురువారం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సందర్శించారు.

Peddapalli:   రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

- ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

పెద్దపల్లి టౌన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకదృష్టి సారించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా సూచిం చారు. గురువారం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సందర్శించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిస రాలను పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ పోలీసులు మరింత కృషిచేయాలని కమిషనర్‌ సూచించారు. రోడ్‌సేఫ్టీ నిబంధనలు, హెల్మెట్‌ వినియోగం, సీట్‌ బెల్ట్‌ ధరించడం, డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ వల్ల కలిగే నష్టాలపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేయాలని తెలిపారు. ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకొని ప్రమాదాలనివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రతిరోజూ ప్రత్యేకవాహన తనిఖీలు నిర్వహించాలని, డ్రంకెన్‌డ్రైవ్‌ కార్యక్రమాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తూ, వాహనదారులు అప్రమత్తంగా డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆయనవెంట ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు అనిల్‌కుమార్‌, ప్రవీన్‌కుమార్‌లున్నారు.

Updated Date - May 14 , 2026 | 11:47 PM