Peddapalli: పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:30 AM
కోల్‌సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టిసారించాలని డీసీపీఅడ్మిన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం రామ గుండం పోలీస్‌కమిషనరేట్‌లో ఫిట్‌కాప్‌యాప్‌లో ఆరోగ్యవివరాల నమో దుకు శ్రీకారం చుట్టారు.
డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్
కోల్‌సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టిసారించాలని డీసీపీఅడ్మిన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం రామ గుండం పోలీస్‌కమిషనరేట్‌లో ఫిట్‌కాప్‌యాప్‌లో ఆరోగ్యవివరాల నమో దుకు శ్రీకారం చుట్టారు. యాప్‌వినియోగంపై పోలీసులకు ప్రత్యేకశిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిట్‌కాప్‌యాప్ ద్వారా పోలీస్ సిబ్బంది ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఆరోగ్యసమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్యసలహాలు, చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో డీసీపీ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యంగా మధు మేహం, అధిక రక్తపోటు, బీఎంఐ ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, జీవన శైలి, అలవాట్లు, శారీరక వ్యాయామనం, దూమపానం, మద్యపానం వంటి వివరాలను ఈవివరాలనునమోదుచేసి అవగాహన కల్పించినట్టు చెప్పా రు. కార్యక్రమంలో ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్‌ఐలు మల్లేషం, పెద్దన్న, ఎస్‌ఐ సంతోష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, ఐటీకోర్ కోఆర్డినేటర్ రాము, సిబ్బంది రఘు, రాజేందర్, హెల్పింగ్‌హ్యాండ్ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.