Peddapalli: జాతరలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:44 AM
పెద్దపల్లి రూరల్/సుల్తానాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల జరుగనున్న సమ్మక్క జాతరలలో పారిశుధ్యం పనుల నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ చూపాలని దేవాదాయశాఖ సహాయ కమి షనర్ సుప్రియ అధికారులను ఆదేశిం చారు.
- దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ
పెద్దపల్లి రూరల్/సుల్తానాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల జరుగనున్న సమ్మక్క జాతరలలో పారిశుధ్యం పనుల నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ చూపాలని దేవాదాయశాఖ సహాయ కమి షనర్ సుప్రియ అధికారులను ఆదేశిం చారు. పెద్దపల్లిమండలంలోని హన్మంతు నిపేటలో, సుల్తానాబాద్ మండలం నీరు కుళ్ల సమ్మక్కజాతర పనులను గురు వారం ఆమె పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. హన్మంతునిపేటలో జాతరకమిటీ చైర్మన్ సుధాకర్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా సహాయ కమిషనర్ సుప్రియ మాట్లాడుతూ జిల్లాలోని నీరు కుళ్లతోపాటు హన్మంతునిపేట, మీర్జంపేట, కొలనూరు జాతర ప్రాంతాలను సంద ర్శించానని ఆయాగ్రామాల్లో నిర్వహించే జాతరల్లో పారిశుధ్యంతోపాటు భక్తులకు మంచినీటివసతి ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించామన్నారు. జాతరవద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా అధికారులు, కమిటీ సభ్యులు చూసుకోవాలని సూచించారు. వారి వెంట పరిశీలకులు సత్యనారాయణ, శ్రీనివాస్, ఈవోలు సదయ్య, ముద్దసాని శంకర్, చైర్మన్ పొన్నం చంద్రయ్య, డైరక్టర్లు రాజయ్య, ప్రశాంత్, శ్రీనివాస్, ఈవోలు సదయ్య శంకర్ తదితరులు ఉన్నారు.