Share News

Peddapalli: హైవే పరిసర గ్రామాల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:30 AM

పెద్దపల్లి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌రహ దారి(హైవే) వెంట ఉన్న గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి, రోడ్డుపక్కన ఎక్కడా చెత్త పేరుకు పోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

Peddapalli:  హైవే పరిసర గ్రామాల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

- కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌రహ దారి(హైవే) వెంట ఉన్న గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి, రోడ్డుపక్కన ఎక్కడా చెత్త పేరుకు పోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అదనపు కలెక్టర్‌(లోకల్‌బాడీస్‌) అరుణశ్రీతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజీవ్‌ రహదారి గర్రెపల్లి నుంచి రామగుండం వరకు రోడ్డు పక్కన ఎక్కడా చెత్తవేయకుండా నిరంతరం శుభ్రత నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైవే వెంట ఉన్న గ్రామా లు రోడ్డు పక్కల శుభ్రతను క్రమం తప్పకుండా నిర్వ హించాలని, గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుధ్య కార్య క్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పక్కన చెత్త వేయకుండా అవ గాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌, సంబంధిత అధికారులు, పంచా యతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థుల

ఫలితాలు అభినందనీయం..

పెద్దపల్లి కల్చరల్‌ : ఇటీవల విడుదలైన ఇంటర్మీ డియట్‌ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల కలెక్టర్‌ కోయశ్రీహర్షం హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షే మ అధికారి నరేష్‌ కుమార్‌తోకలిసి కలెక్టర్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను అభినం దించారు. భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను సాధించేం దుకు పోటీపరీక్షలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇందులో శ్రీశాంతి 500మార్కులకు 482, షీబా 480మార్కులు సాధించగా, చంద్రవైష్ణవి 491 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి, టీజీఎంఆర్‌ఈఐఎస్‌లో మొదటిస్థానం పొందినట్లు పేర్కొన్నారు. అలాగే హర్షిత 485, సువర్ణరాణి వెయ్యి మార్కులకు943, నస్రీన్‌891 మార్కులు సాధించారని, లక్ష్మిప్రసన్న981మార్కులతో టీజీఎంఆర్‌ఈఐఎస్‌లో 2వ స్థానం పొందారని తెలిపారు. అఖిల973మార్కులు సాధించగా, శ్రీహర్షిత, శివ సంజనలు470కి గాను 455 మార్కులు సాధించారన్నారు. నిదాకౌనిన్‌990 మార్కు లతో రాష్ట్రస్థాయిలో 7వర్యాంక్‌ సాధించడం పట్ల జిల్లా కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే మనోగ్న 440 మార్కులకు 436మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వర్యాంకు సాధించగా, రిమ్షా964మార్కులు సాధిం చడం రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు లభిం చడంపట్ల ఆయన అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నతస్థానాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరమ్మతులు పూర్తి చేయాలి..

సుల్తానాబాద్‌ : విద్యార్థి వసతిగృహాల్లో, పలు గురుకులాలలో చేపట్టిన చిన్నచిన్న మరమ్మతు పను లను రాబోయే విద్యాసంవత్సరానికి ముందే పూర్తిచే యాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులకు సూచిం చారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో మరమ్మతు పనులు చేపడుతున్నారు. బుధవారం కలెక్టర్‌ సుల్తానా బాద్‌ పట్టణంలోని శాస్త్రినగర్‌లోగల ఎస్సీ రెసిడెన్షి యల్‌ విద్యాలయాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హాస్టళ్లలో చేపట్ట బోయే డోర్లు, కిటికీల మరమ్మతులకు అవసరమైన బడ్జెట్‌ విడుదలకు చర్యలు తీసుకుంటానని అన్నారు. అన్ని మరమ్మతు పనులను గడువులో పూర్తిచేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించా లని స్పష్టంచేశారు. కలెక్టర్‌వెంట గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్‌ క్రిష్ణమాచార్య, అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:30 AM