Share News

Peddapalli: దేశవ్యాప్త వేలం పాటలో సింగరేణి పాల్గొనాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:40 AM

గోదావరిఖని, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త వేలం పాట లో సింగరేణి పాల్గొనాలని బీఎం ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ యాదగిరి సత్తయ్య అన్నారు.

Peddapalli:  దేశవ్యాప్త వేలం పాటలో సింగరేణి పాల్గొనాలి

గోదావరిఖని, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త వేలం పాట లో సింగరేణి పాల్గొనాలని బీఎం ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ యాదగిరి సత్తయ్య అన్నారు. ఆదివారం స్థానిక సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మికసంఘ్‌ (బీఎంఎస్‌) కేంద్రకార్యాలయంలో ఆర్‌జీ-1 ఏరియా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయ న పాల్గొని మాట్లాడారు. సింగరేణి పరి శ్రమలోని కోయగూడెం ఓసీపీ, ఇల్లం దు, శ్రావణపల్లి ఓసీపీ, మందమర్రి బొగ్గుబ్లాక్‌ టెండర్‌లలో సింగరేణి వేలంపాటలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు.

సింగరేణి టెండర్‌లో పాల్గొంటే బ్లాకులు సింగరేణి సంస్థకు వచ్చే విధంగా కృషిచే స్తామని కేంద్రబొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు గుండె కాయలాంటి సింగరేణిసంస్థ భవిష్య త్‌ను, వేలాదిమంది కార్మికులు ఉద్యోగు ల ఉద్యోగభద్రతను దృష్టిలో ఉంచుకుని వేలంలో సింగరేణి పాల్గొని, ఆయా బ్లాకులు సింగరేణికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కర్రావుల మహేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడరామ్మూర్తి, పల్లెశ్రీని వాస్‌, గంగిశెట్టి నరసింహులు, నీలం శ్రీనివాస్‌, మేడఅజయ్‌కుమార్‌, బొజ ్జపల్లి నాగరాజు, ఆర్‌ఎల్‌ వెంకట రాజం పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:40 AM