Share News

Peddapalli: ఐటీ, పరిశ్రమలు వాణిజ్య రంగాల్లో గణనీయమైన వృద్ధి

ABN , Publish Date - May 31 , 2026 | 12:47 AM

సుల్తానాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హయాంలో రాష్ట్రంలో ఐటీ,పరిశ్రమల రంగాలు గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు.

 Peddapalli:  ఐటీ, పరిశ్రమలు వాణిజ్య రంగాల్లో గణనీయమైన వృద్ధి

- ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

సుల్తానాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హయాంలో రాష్ట్రంలో ఐటీ,పరిశ్రమల రంగాలు గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. మంత్రి శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలను ఐబీవద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన విజయరమణారావు కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు స్వీట్లుపంచారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఉమ్మడికరీంనగర్‌ జిల్లాతో పాటు రాష్ట్రంలో శ్రీధర్‌బాబు అనేక అభివృద్ధి పను లకు శ్రీకారం చుట్టారని అన్నారు. నాడు వారి తండ్రి ఉమ్మడిరాష్ట్ర అసెంబ్లీస్పీకర్‌గా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములయ్యారని కొనియాడారు. భవిష్యత్తులో శ్రీధర్‌బాబు మరింత ఉన్నతస్థానం పొందాలని ఆకాం క్షించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబు.. వారి తండ్రి శ్రీపాదరావు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. మార్కెట్‌చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడిజిల్లాలో పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారని కొనియా డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్షలత, సింగిల్‌ విండోచైర్మన్‌ శ్రీగిరిశ్రీనివాస్‌, కౌన్సి లర్లు, నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధి ప్రదాత

మంత్రి శ్రీధర్‌బాబు

కళ్యాణ్‌నగర్‌ : తెలంగాణ అభివృద్ధి ప్రదాత మంత్రి శ్రీధర్‌బాబు అని రామగుండం మేయర్‌ మహంకాళిస్వామి, నగరఅధ్యక్షుడు బొంతల రాజేష్‌ అన్నారు. శ్రీధర్‌బాబు జన్మదినం సందర్భంగా శని వారం గోదావరిఖని చౌరస్తాలో కేక్‌కట్‌చేసి అన్నదానం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు కరీంనగర్‌ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. లీగల్‌సెల్‌చైర్మన్‌ కొప్పులశంకర్‌, మేయర్‌ మహంకాళి స్వామి హజరై కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, సీనియర్‌ కాంగ్రెస్‌నాయకులు కాల్వలింగస్వామి, కార్పొ రేటర్లు దూళికట్టసతీష్‌, చిదురాలనాగరాజు, తిప్పారపు మానస, గట్ల రమేష్‌, ముస్తాఫా, నాయకులు చుక్కల శ్రీనివాస్‌, ఓదెలు, దాసరి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 12:47 AM