Share News

Peddapalli: స్ర్కీనింగ్‌ పరీక్షలను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:25 AM

సుల్తానాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మధుమేహం, రక్త పోటు, ఇతర అసంక్రామిత వ్యాధుల గుర్తింపు కోసం స్ర్కీనింగ్‌ పరీక్షలను వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ పవిత్ర అన్నారు.

Peddapalli: స్ర్కీనింగ్‌ పరీక్షలను వేగవంతం చేయాలి
సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో సమీక్ష

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ పవిత్ర

సుల్తానాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మధుమేహం, రక్త పోటు, ఇతర అసంక్రామిత వ్యాధుల గుర్తింపు కోసం స్ర్కీనింగ్‌ పరీక్షలను వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ పవిత్ర అన్నారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రులను గురువారం సందర్శించి రోగులకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఈ సంద ర్భంగా గైనకాలజిస్టులతో సమావే శమై, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఎన్‌సీ, పీఎన్‌సీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, మిడ్‌వైఫరీలకు స్పష్టమైన సూచనలు జారీచేశారు. గర్భిణులతో మాట్లాడా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలు, ప్రసవ సదుపాయాలు, తల్లీ, బిడ్డ సంరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు నిర్వహించాలని తెలిపారు. అనం తరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పర్యవేక్షక సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రసవాల పెరిగేలా చూడడం, గర్భిణులకు నిరంతర పర్యవేక్షణ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పర్యవేక్షక సిబ్బంది కీలకపాత్ర పోషించాలని సూచించారు.

Updated Date - Nov 27 , 2026 | 12:25 AM