Share News

Peddapalli: మహిళా విద్యావిప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:34 AM

కమాన్‌పూర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మహిళా విద్యావిప్లవానికి మార్గదర్శిగా సావిత్రి బాయి ఫూలే నిలిచారని పలువురు ప్రజాప్రతి నిధులు, నాయకులు పేర్కొన్నారు.

Peddapalli:  మహిళా విద్యావిప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే

కమాన్‌పూర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మహిళా విద్యావిప్లవానికి మార్గదర్శిగా సావిత్రి బాయి ఫూలే నిలిచారని పలువురు ప్రజాప్రతి నిధులు, నాయకులు పేర్కొన్నారు. మంగళ వారం సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా మండలకేంద్రంలోని బస్టాండ్‌ ఏరియాలోగల అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్ర్తీ విద్యసమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అసువులు బాసారన్నారు. భర్త జ్యోతిరావు ఫూలేతోకలిసి పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి శంకర్‌, నాయకులు రానవేన లక్ష్మణ్‌, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్‌ : సావిత్రిబాయిఫూలే వర్ధంతిని గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వడిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్ర మంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.ఏఐఎస్‌ఎఫ్‌ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, సీనియర్‌ ఉపాధ్యాయురాలు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయిఫూలే సేవలను కొనియాడారు. కార్యక్ర మంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎలుకపల్లి సురేష్‌ అనుప్‌ సాయి, జశ్వంత్‌, అభిషేక్‌, చైత్ర, సాయి శరణ్య, అమీనా, ప్రహర్షిని పాల్గొన్నారు.

ఎలిగేడు : మండల కేంద్రంతోపాటు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మంగళ వారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమెచేసిన సేవలను కొనియాడారు. కార్యక్ర మాల్లో సర్పంచ్‌లు పల్లెర్ల వెంకటేష్‌గౌడ్‌, కవ్వంపల్లి బాపయ్య, కప్పల ప్రవీణ్‌, మారం కొమురయ్య, మద్దెల రమాదేవి, సిద్ది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మంథని : దేశంలో తొలిమహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రి బాయిఫూలే వర్థంతి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులు మంగళవారం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాలుళర్పించారు. కార్యక్రమంలో ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, వేల్పుల గట్టయ్య, రాజబాపులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:34 AM