Peddapalli: గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:40 AM
ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) సమ్మక్క సారలమ్మ జాతర జిల్లాలో పలు చోట్ల ఆరంభమయింది. బుధవారం సాయం త్రం సారలమ్మను మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు రహస్యంగా కన్నెగూడ ప్రాంతంలో పూజలు నిర్వహించి డప్పుల చప్పుళ్లు,
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సమ్మక్క సారలమ్మ జాతర జిల్లాలో పలు చోట్ల ఆరంభమయింది. బుధవారం సాయం త్రం సారలమ్మను మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు రహస్యంగా కన్నెగూడ ప్రాంతంలో పూజలు నిర్వహించి డప్పుల చప్పుళ్లు, మహిళ మంగళహారతులు, శివస త్తుల పూనకాలు, భక్తుల కోలాహలం మధ్య గద్దెలపైకి తీసుకవచ్చారు. గద్దెకు చేరకోవడం తోనే జాతర తొలిఘట్టం ఆవిష్కృతమయ్యిం ది. జాతరలకు సమీపంలో కన్నెగూడగా పిలుచుకునే ప్రాంతంనుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకవచ్చారు. అలాగే పగిడిద్ద రాజు, గోవింద రాజులను కూడా గద్దెలపైకి తీసుక రావడంతో భక్తులు గద్దెల వద్దకు వచ్చి దేవుళ్లను దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క చిలకలగుట్ట నుంచి తీసుకురానున్నారు. జిల్లాలోని అంతర్గాం మండల గోదావరి ఒడ్డున గల గోలివాడ, గోదావరిఖని లోని గంగ బ్రిడ్జి వద్ద, మానేరు తీరానగల సుల్తానాబాద్ మండలం నీరు కుల్ల, ఓదెల మండలం కొలనూర్, కాల్వశ్రీ రాంపూర్ మండలం మీర్జంపేట్, పెద్ద రాతు పల్లి, కమాన్‌పూర్ మండలం గుండారం, ముత్తారం మండలం మైదుబండ, పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, హన్మంతుని పేట, పెద్దకల్వల, పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి, వేమునూర్, రాణాపూర్, ధర్మారం మండలం ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లి, నందిమేడారం, చామనపల్లి, దొంగతుర్తి, నర్సింగాపూర్,ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, తేలుకుంట, జూలపల్లి మండలం అబ్బాపూర్, సుల్తానాబాద్ మండ లం గర్రెపల్లి, నారాయణపూర్, తొగర్రాయి, ఓదెల మండలం గుంపుల, తదితర ప్రాంతాల్లో సమ్మక, సారలమ్మ జాతర ఆరంభం అయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు వస్తున్నారు. జిల్లాలో 34చోట్ల జరగనున్న ఈ జాతరకు 15లక్షలకు పైగా భక్తులు జిల్లా నుంచే గాకుండా ఇతరజిల్లాల నుంచి కూడా వస్తారని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరల వద్ద పోలీస్ బందో బస్తు, వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు గోదావరిఖని గంగబ్రిడ్జి వద్ద గల సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించి పూజలు చేశారు.
పాలకుర్తి/అంతర్గాం/కళ్యాణ్‌నగర్/ మార్కండేయకాలనీ /పెద్దపల్లి రూరల్ /కాల్వశ్రీరాంపూర్/ఓదెల/సుల్తానాబాద్/మంథని రూరల్: గోదావరిఖని గోదావరి తీరంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మనాలీ ఠాకూర్ దంతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మేడారం కోయ పూజారులచే సమ్మక్క - సారలమ్మలకు అభిషేక వడిబియ్యం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండోమేడారంగా అభివృద్ధి చెందిన గోదావరిఖనికి హాజరయ్యే లక్షలాది మంది సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, పాలకుర్తి, అంతర్గాం, ఓదెల, సుల్తానాబాద్, మంథని మండలా ల్లోని పలు గ్రామాల్లో బుధవారం గద్దెలకు పూజలు చేసిన అనంతరం కోయపూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో సారలమ్మను తీసుకు వచ్చారు. అనంతరం భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఓదెలమండలంలో జాతర స్థలం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ధన గుట్ట నుంచి కోయ పూజారులు పసుపు, కుంకుమ, కంకవనంతో సారలమ్మను శోభా యాత్రగా తీసుకోవచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. కిలోమీటర్ పొడవున భద్రతతో శివసత్తుల మధ్యసారలమ్మను ఘనంగా స్వాగతించారు.