Share News

Peddapalli: హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:39 AM

పెద్దపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): హింసకు గుర వుతున్న మహిళలకు సఖీ సెంటర్‌ ద్వారా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

Peddapalli:   హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): హింసకు గుర వుతున్న మహిళలకు సఖీ సెంటర్‌ ద్వారా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం ఆయన రంగంపల్లిలోని సఖీ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా కౌన్సిలింగ్‌ తీసుకుంటున్న వివిధ జంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్‌ ద్వారా రిలీఫ్‌ రావాలని, ఇటువంటి కేసులపై ఆధిక శ్రద్ధ వహించా లని కలెక్టర్‌ సూచించారు. సఖీ సెంటర్‌కు వచ్చిన మహిళల సమస్య పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్‌గా ఫాలో అప్‌ చేయాలని సూచించారు. సఖీ సెంటర్‌కు వచ్చే బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్‌ అందించాలని, వివిధ కేసులలో అవసరమైన సంద ర్భంలో న్యాయ సలహా సైతం అందించాలని కలెక్టర్‌ సూచించారు.

ఫ 15లోపు హెచ్‌ఎల్‌బీ బ్లాక్‌

నిర్ధారణ పూర్తిచేయాలి

పెద్దపల్లి టౌన్‌ : జనగణన2027 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 15లోపు హెచ్‌ఎల్‌బీబ్లాక్‌ నిర్దారణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష సూచిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం జనగణన 2027పై సంబంధిత అధికారులతో కలె క్టర్‌, కోయ శ్రీహర్ష, స్థానికసంస్థల అద నపు కలెక్టర్‌ జె అరుణశ్రీతో కలిసి సమా వేశ మందిరం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జనగణన2027 రెండు దశలలో జరుగుతుందన్నారు. ప్రస్తుత సంవత్సరం హౌజ్‌లిస్టింగ్‌ కార్యక్రమం మే10నుంచి ప్రారంభం అవుతుందని, ప్రతిఇంటికి సంబంధించి 35ప్రశ్నల వివరాలు నెల రోజుల వ్యవధిలో సేకరించాలని కలెక్టర్‌ తెలిపారు. ఫిబ్రవరి 2027లో హౌస్‌లిస్టింగ్‌ ప్రకారం జనాభా వివరాల సేకరణ చేయాలన్నారు. ప్రతి 300 ఇండ్లు/800జనాభా ఒక హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌(హెచ్‌ ఎల్‌బీ)గా నిర్దేశించి జనాభాలెక్కల చేసేందుకు బృం దాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ సూచించారు. ఫీల్డ్‌ సర్వే సమయంలో మనం వేసుకునే అంచనా కంటే ఎక్కువ ఇండ్లుఉండే అవకాశం ఉన్నందున 15శాతం అధికంగా ఎన్యుమరేటర్లు నియామకం చేప ట్టాలన్నా రు. పట్టణప్రాంతాల్లో హెచ్‌ఎల్‌బీలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్‌15లోపు తుది హెచ్‌ఎల్‌బీ నిర్దారణపూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Apr 02 , 2026 | 12:39 AM