Peddapalli: సాదాబైనామా దరఖాస్తులను జూలై10 నాటికి పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:58 PM
పెద్దపల్లి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తులను జూలై 10 నాటికి పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
- రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్
పెద్దపల్లి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తులను జూలై 10 నాటికి పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయశ్రీహర్ష, అదనపుకలెక్టర్ (రెవెన్యూ) కొప్పుల వెంకట్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచిం చారు. భూభారతి, ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. కులం, ఆదాయం, నివాసం తదితర మీసేవ ధ్రువపత్రాలను 30రోజులలోపు జారీచేయాలని, ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు. 60 రోజు లకుపైగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తు లను ప్రత్యేకదృష్టితో పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించా లని సూచించారు. ప్రజలకు రెవెన్యూసేవలను మరిం త పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, కలెక్ట రేట్ ఏవో బండి ప్రకాష్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
ఫ 99రోజుల ప్రజాపాలన విజయాలను
పుస్తకంగా రూపొందించాలి..
ప్రతిశాఖ భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా నిర్దేశించుకుని, 99రోజుల ప్రజాపాలన విజయాలను ఆకర్షణీయమైన పుస్తకంగా రూపొందించాలని రెవె న్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్ అధికారు లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి జిల్లా లో 99రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో అమలైన కార్యక్ర మాలు, విజయాలు, వినూత్న చర్యలు, ఇతర జిల్లాలు అనుసరించదగిన ఉత్తమ విధానాలను పొందుపరుస్తూ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించాలని సూచించారు. ప్రతి శాఖ 99రోజుల కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, పెండింగ్ అంశాలు, చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సంక్షిప్త నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలనుంచి వచ్చిన వినతులు, పరిష్కరించిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కొప్పుల వెంకట్ రెడ్డి, జె అరుణశ్రీ, వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.