Share News

Peddapalli: నిర్దేశిత గడువులోగా రోడ్ల పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - May 14 , 2026 | 11:49 PM

పెద్దపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి

 Peddapalli: నిర్దేశిత గడువులోగా రోడ్ల పనులు పూర్తిచేయాలి

కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాల యంలో ఆర్‌అండ్‌బీశాఖ అధికారులతో నిర్వ హించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవ నాల నిర్మాణపనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల అమలులో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించా లని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ న్వయంతో పనులు నిర్వహించాలని తెలి పారు. టెండర్‌దశలో ఉన్న అభివృద్ధి పను లను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అవసరాల కోసం భూసేకరణ జరుగుతున్న కొన్నిగ్రామాల్లో అవసరం లేని రహదారి విస్తరణ పనులను ప్రోత్సహించవద్దని తెలిపారు. మెడికల్‌ కళా శాల నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేసి సంబంధితశాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంథని గెస్ట్‌హౌస్‌ నిర్మాణ పనులను నిర్దేశిత 9నెలల గడువులో పూర్తి చేయాలని సూచిం చారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారుల మరమ్మతు పనులను ప్రాధా న్యతతో చేపట్టాలని తెలిపారు. పనులు జరు గుతున్న ప్రాంతాల్లో భద్రతాచర్యలు తప్పనిసరిగా పాటించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ బిల్లులు, భూసేకరణ, విద్యుత్‌ లైన్‌ మార్పిడివంటి సమస్యలను సంబంధిత శాఖ లతో సమన్వయం చేసుకుని త్వరగా పరిష్క రించాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నా రు. వారంవారీగా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈభావ్‌సింగ్‌, సీపీవో రవీం దర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ భూములకు

ఉచితంగా చెరువు మట్టి

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల ప్రయోజనంకోసం చెరువులలోని సారవంత మైన మట్టిని ఉచితంగా పంపిణీచేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల రైతులు రేపటి నుంచి సంబంధిత తహసీ ల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నీరు లేని చెరువుల నుంచి మట్టిని తరలించుకోవడానికి దరఖాస్తులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పాసు పుస్తకం (పీపీబీ) వివరాలతోపాటు, రవాణాచేసే వాహనం రకం, వాహనం నంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. మట్టిని కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, ఇతర పనులకు మళ్లిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

రంగాపూర్‌ గోదాములను

పరిశీలించిన కలెక్టర్‌

పెద్దపల్లి రూరల్‌ : మండలంలోని రంగాపూర్‌లోని ఐజీ గోదాములను గురు వారం పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కోనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కేంద్రాల వద్ద ఉంచకుండా వెంటనే మిల్లులకు తరలిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Updated Date - May 14 , 2026 | 11:49 PM