Share News

Peddapalli రాజీమార్గంలో కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:16 AM

పెద్దపల్లి టౌన్‌: సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) జిల్లా వ్యాప్తంగా ఈ నెల12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు.

Peddapalli రాజీమార్గంలో కేసుల పరిష్కారం

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లి టౌన్‌: సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) జిల్లా వ్యాప్తంగా ఈ నెల12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. గురువారం జిల్లాకోర్టు సముదాయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, సివిల్‌దావాలు, భూవివాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహారం, బ్యాంకు రికవరీ, చెక్‌బౌన్స్‌, కుటుంబ తగాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. కేసులు రాజీపరిధిలోకి వస్తాయో లేదో తెలుసుకునేందుకు న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. అనంతరం అదనపు న్యాయమూర్తి స్వప్నారాణి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌తో కలిసి జాతీయ లోక్‌ అదాలత్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - Sep 11 , 2026 | 12:16 AM