Share News

Peddapalli: రామగుండాన్ని ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - May 28 , 2026 | 12:21 AM

కోల్‌సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

Peddapalli:  రామగుండాన్ని ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతా

రూ.4.18కోట్ల అభివృద్ధిపనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

కోల్‌సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బుధవారం 48వ డివిజన్‌ టీచర్స్‌కాలనీలో రూ.4.18కోట్ల డీఎంఎఫ్‌టీ నిధు లతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 26, 2వడివిజన్‌లో సీసీరోడ్లు, బీటీ రోడ్లనిర్మాణం, 48, 49వ డివిజన్‌లలో వర్షంపు నీటి కాలువలు, ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ రామగుండం కార్పొరేషన్‌లో రూ.800కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.400కోట్ల నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో రామగుండంలో కొత్తగా 8వాటర్‌ ట్యాంకులు నిర్మించి నగరం అంతా ప్రజలకు 24గంటల నీటి సరఫ రాను అందించేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. తల్లిదం డ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. త్వరలోనే హరితహోటల్‌ నిర్మించడానికి ప్రభు త్వం నుంచి అనుమతులను కూడా తీసుకురానున్నట్టు చెప్పారు. మేయర్‌ మహంకాళిస్వామి మాట్లాడుతూ టీచర్స్‌కాలనీలో వరద ప్రభావంతో గతంలో నీరు చేరేదని, అలా జరుగకుండా కొత్తగా నాలా నిర్మిణాన్ని చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, సాగి సంతోష్‌రావు, వెంగళబాబు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ గురువీర్‌ పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు మరో ముందడుగు..

పాలకుర్తి : మండలకేంద్రంతో పాటు గుంటూర్‌ పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వివో(విలేజ్‌ ఆర్గనైజేషన్‌) మహిళా భవనాలకు బుధవారం రామ గుండం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ భవన నిర్మాణాలతో మహిళా సాధికారతకు మరో ముందడుగు పడిందన్నారు. మహిళా సంఘాల సమావేశాలకు, అభివృద్ధి కార్యక్ర మాల అమలుకు ఈ భవనాలు ఎంతో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో సెర్ప్‌ఏపీఎం బొల్లం భాగ్యమ్మ, డీపీఎం రవి, అడిషనల్‌ డీఆర్డీవో రవిందర్‌, స్థానిక ఎంపీడీవో పొల్సాని శశికళ, రామగుండం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి, కన్నాల సహకార సంఘం చెర్మన్‌ బయ్యపు మనోహర్‌ రెడ్డి,మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్‌గౌడ్‌,మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్‌,సర్పంచ్‌లు పెద్దపల్లి తిరుమల, పర్షవేణి శ్రీనివాస్‌,తోట స్వప్న, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసా యశాఖ అధికారులతో కలిసి మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో రైతులకు జీలుగా విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ అధికారులు బండి ప్రమోద్‌కుమార్‌,ఎస్‌ఐ నూతి శ్రీధర్‌పాల్గొన్నారు.

తహసీల్దార్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం..

స్థానికతహసీల్దార్‌ జే సునీతపై రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూమిపూజా కార్యక్రమానికి వచ్చిన ఆయన తహసీల్దార్‌ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుపల్లెకు వెళ్తున్న ఎమ్మెల్యేను ఎల్క లపల్లివద్ద తహసీల్దార్‌ కలుసుకొని కార్యక్రమానికి హాజరు కాలేక పోవడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే ఏమి పట్టించుకోలేదు. జూన్‌10న ప్రారంభం కానున్న పాలకుర్తి నూతనతహసీల్దార్‌ కార్యాలయపనులు పూర్తి కావాలని ఆ ఏర్పాట్లలో ఉండాలంటూ సమస్యను అక్కడితో ముగించారు.

రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలి..

కోల్‌సిటీ : రామగుండం నియోజకవర్గ ప్రజలు సుభి క్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బుధవారం గోదావరిఖని గౌతమినగర్‌లోని అయ్యప్పస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను ఎళ్ల ప్పుడూ అయ్యప్పస్వామి చల్లగా చూస్తూ నియోజకవర్గ అభివృద్ధికి మరింతశక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు.

Updated Date - May 28 , 2026 | 12:21 AM