Share News

Peddapalli: ఉరుములు, మెరుపులతో వర్షం

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:29 AM

కళ్యాణ్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నిన్నటివరకు భానుడితో భగభగమన్న రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో అకాలంగా బుధవారం తెల్లవారు జాము నుంచి వడగండ్లవాన కురి సింది.

Peddapalli:  ఉరుములు, మెరుపులతో వర్షం

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వడగండ్ల వాన

జలమయమైన రోడ్లు

కళ్యాణ్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నిన్నటివరకు భానుడితో భగభగమన్న రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో అకాలంగా బుధవారం తెల్లవారు జాము నుంచి వడగండ్లవాన కురి సింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు భారీవర్షం కురిసింది. కొన్నిచోట్ల గాలికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తెల్లవారుజామున 4గంటలకు మొదలైన వడగండ్ల వాన ఉదయం 6.30 గంటల వరకు కురిసింది. దీంతో కొన్ని ప్రాం తాల్లో ఇండ్లలోకి నీరుచేరగా కార్పొరేషన్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కళ్యాణ్‌నగర్‌, విఠల్‌నగర్‌, గాంధీనగర్‌, ఫైవింక్లయిన్‌, గోదావ రిఖని ప్రభుత్వఏరియా ఆసుపత్రికి వెళ్లేదారిలో నీరు నిల్వడంతో ఆసుపత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన నాలాలు వర్షం నీటితో పొంగిపొర్లాయి. ఉదయం కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. 6.9మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. భానుడిప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఒకేసారి వాతావరణం చల్లబడడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరో రెండురోజులు వర్షాలు ఉంటాయని వాతవరణ శాఖ తెలిపింది.

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని వెన్నం పల్లి, కూనారం, మంగపేట తదితర గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలరూపాయల నష్టంవాటినట్లు వాపోయారు. కూనారంలో పిడుగుపడి ఒగ్గే రమేష్‌కు చెందిన రూ.50వేల విలువగల గేదెమృతిచెందింది. ప్రభుత్వ పరం గా బాధితున్ని ఆదుకోవాలని పలువురు కోరా రు. మండలంలోని వెన్నంపల్లి తదితర గ్రామా ల్లో నేలవాలిన మొక్కజొన్నను బుధవారం ఎంపీపీ సారయ్యగౌడ్‌, పలువురు సర్పంచ్‌లు, కాంగ్రెస్‌నాయకులు పరిశీలించారు. మండ లంలో 350ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలి నట్లు, నివేదికను ప్రభుత్వానికి వ్యవసాయ అధికారులు అందజేయనున్నట్లు ఆయన తెలి పారు. ఎమ్మెల్యేసహకారంతో పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు.

మంథని: పట్టణంతోపాటు పలుగ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. పొట్ట దశలో ఉన్న వరిపంటలు, చేతికి వచ్చిన ఎండు మిర్చి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. ఈదురు గాలులతో జనం వణికిపోయారు.

జూలపల్లి: మండలంలో అకాలవర్షం గాలి వీచడంతో మామిడిచెట్ల పూత, పిందెలు, కాయలు రాలిపోయాయి. టమాట, మొక్క జొన్న పంటలు కూడా కొంతమేర నష్టపో యామని రైతులు పేర్కొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:29 AM