Share News

Peddapalli: నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లోడింగ్‌ చేయాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:07 AM

పెద్దపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్‌ చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

Peddapalli:   నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లోడింగ్‌ చేయాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్‌ చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలుకేంద్రాల వద్ద హమాలీ కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని అధి కారులకు సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్‌చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు తూకంచేసి సురక్షితంగా నిల్వచేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారులు, ఏడీఏ, తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ భరోసా..

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులు తమపంటను కనీస మద్దతు ధరపై విక్రయించేందుకు ప్రత్యేకంగా కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పెద్దపల్లి, పోత్కపల్లి, రేగడిమద్దికుంట, ధర్మారం, జూలపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ద్వారా మొక్కజొన్న కొనుగోలుకేంద్రాలు ప్రారంభించి నట్లు తెలిపారు. మరిన్నికేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొ న్నారు. కౌలురైతులు కూడా మొక్కజొన్న విక్రయానికి అవకాశం కల్పిం చామ ని తెలిపారు. మొక్కజొన్నరైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి కనీసమద్దతు ధర రూ.2400ప్రతిక్వింటాల్‌కు పొందాలన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 01:07 AM