Share News

Peddapalli: సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - May 23 , 2026 | 12:41 AM

పెద్దపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజాస మస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష సూచించారు.

Peddapalli:  సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలకు పరిష్కారం

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజాస మస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన 99రోజుల ప్రజాపాలన ప్రగతిప్రణాళిక జిల్లాస్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనేకకార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి వారం ఒక్కోశాఖకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమా లను నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర సంవత్సరాలుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరించేందుకు ప్రభుత్వం 99రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిం చామన్నారు. ప్రజలనుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, అందుకే నేడు జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు కలె క్టర్‌ తెలిపారు. ఇందిరమ్మఇళ్ల కార్యక్రమంలో భాగంగా ప్రజలనుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ అభి వృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమ లు చేసేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. పెండింగ్‌లో ఉన్నఫైళ్లను త్వరితగతిన పరిష్క రించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అన్నిశాఖల జిల్లాఅధికారులు ఇందులో భాగస్వామ్యం కావాలని ‘ప్రతి అధికారి ఇది నా బాధ్యత’ అనే భావనతో పెండింగ్‌లో ఉన్న పను లను పూర్తిచేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమ న్వయంతో పనిచేయాలని తెలిపారు. కాలానుగుణంగా మార్పులను స్వీకరించాలని, పనులను ఒత్తిడితో కాకుండా ఆసక్తి, బాధ్యతాభావంతో నిర్వహిస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు తమదైన బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్‌యార్డు,

రైల్వేస్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్‌

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, రైల్వేస్టేషన్‌లో గల యూరియా రాక్‌ పాయింట్‌ను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో పలువురు రైతులు తాము పదిహేను, ఇరవైరోజులుగా మక్కల కాంటాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సంచులు ఇవ్వడంలేదని, సత్వ రమే మక్కలు కొనుగోలు చేసేలా చర్యలు తీసు కోవాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. మార్కెట్‌కు రైతులు తీసుకొస్తున్న ధాన్యం అన్‌లోడింగ్‌ ఆలస్యం చేయకుండా వెంటనే చేపట్టాలని సూచించారు. లారీల కొరత రాకుండా చూసుకోవడంతో పాటు, పనులకు ఆటంకం కలగకుండా తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అలాగే జిల్లాలో వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా రాక్‌ పాయింట్‌ వద్ద ఉన్న యూరియాను లారీలు, హమాలీలను సమకూర్చుకొని త్వరగా జిల్లా వ్యాప్తంగా సప్లై చేయాలని ఆదేశిం చారు. ఆయనవెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:41 AM