Peddapalli: రోగులకు మెరుగైన వైద్యం అందించండి
ABN , Publish Date - May 30 , 2026 | 12:23 AM
కళ్యాణ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి): రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష ఖని జనరల్ ఆసుపత్రి వైద్యు లకు, సిబ్బందికి సూచించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
కళ్యాణ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి): రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష ఖని జనరల్ ఆసుపత్రి వైద్యు లకు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం గోదా వరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గైనకాలజీ, జనరల్ వార్డులను పరిశీలించారు. ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్త పరీక్షకేంద్రంలో సమయం ముగిసిందని ఏ రోగిని వెనుకకు పంపకుండా శాంపిల్స్‌ను సేకరించి రిపోర్టులను సమయానికి అందించాలని ఆదేశించారు. ఆసు పత్రికి కావాల్సిన పరికరాల ప్రతిపాదనను వెం టనే అందించాలన్నారు. సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అనంతరం గోదావరి ఖని శారదానగర్‌లోని ప్రభుత్వ బాలికలజూనియర్ కళా శాలను పరిశీలించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్, అడ్మిషన్లు తదితర అంశాలపై అడిగి తెలుసుకు న్నారు. కళాశాలకు కావాల్సిన పరికరాలకు సంబంధిం చిన ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆయనవెంట ఆర్‌ఎంవోలుఅరుణ, కృపాభాయి, దండె రాజు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు.
మిల్లర్లు కోత విధించవద్దు..
కోల్‌సిటీ : రైతులు తీసుకువచ్చే ధాన్యంలో ఎలాంటి కోత విధించవద్దని రైస్‌మిల్లర్ల యజ మాన్యానికి కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం గౌతమినగర్‌లోని రాజరాజేశ్వర, శ్రీరామ రైస్‌మిల్లలను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైస్‌మిల్లులకు లారీల్లో వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దించుకో వాలని, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని కల్పించవద్దని అన్నారు. వే బ్రిడ్జిల్లో ఎలాంటి మోసాలు లేకుండా తూకం వేయాలని సూచించారు.
ఇందిరా మహిళాశక్తి భవనాన్ని
ప్రారంభానికి సిద్ధం చేయాలి..
పెద్దపల్లి రూరల్ : ఇందిరా మహిళాశక్తి భవనాన్ని జూన్2 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం రాఘ వపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి జిల్లాస్థాయి భవనం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతిపనిని పర్యవేక్షిస్తూ నిర్ణీతగడువులో పూర్తిచేయాలని సూచించారు. పర్యటనలో జిల్లా గ్రామీణఅభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కోప్టా చట్టంను పటిష్టంగా అమలు చేయాలి..
పెద్దపల్లి కల్చరల్ : జిల్లాలో కోప్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్థానికసంస్థల అదనపుకలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎన్‌టీసీపీ, కోప్టా చట్టం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోప్టా చట్టం అమలు అత్యంత అవసరమని, అన్నిశాఖలు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. జిల్లాలోని విద్యా సంస్థలను పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు చర్య లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, పాఠశా లల సమీపంలోని దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీచేయాలన్నారు. పోలీస్‌శాఖ సహకారంతో జూని యర్, ఇంజనీరింగ్, డిగ్రీకళాశాలల్లో ఆకస్మికతనిఖీలు నిర్వహించాలన్నారు. బహిరంగప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్, మార్కెట్‌తదితర ప్రాంతాల్లో ధూమపానం చేసే వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. మైనర్లకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. కోప్టా చట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లావైద్యాధికారి ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.