Peddapalli: గిరిజనుల సంక్షేమం, మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:44 AM
సుల్తానాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్ష ణకు అధికారులు ప్రత్యేకశ్రద్ధతో పనిచే యాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యు డు జాటోత్ హుస్సేన్ అన్నారు
- జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్
సుల్తానాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్ష ణకు అధికారులు ప్రత్యేకశ్రద్ధతో పనిచే యాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యు డు జాటోత్ హుస్సేన్ అన్నారు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా అధికారులతో గిరిజనుల సంక్షేమం, ప్రభుత్వపథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సిఫారసుల ఆధారంగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, అటు వంటి పరిస్థితులను సరిదిద్దాలని సూచించారు. అర్హత కలిగిన ఎస్టీ కుటుంబాలకు ఎలాంటి సిఫారసులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ గిరిజన ప్రాంతాల్లో
మౌలిక వసతులకు ప్రాధాన్యం..
పట్టణాలు, గ్రామాల్లో ఎస్టీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో రహదారులు, డైన్రేజీ, ఇతర మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను సక్ర మంగా చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్య లు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో అవసరమైన రహదా రులు, వంతెనలకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించా రు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 12వేల మంది ఎస్టీ జనాభాలో ప్రధానంగా ఎరుకల, లంబాడా సామాజికవర్గాల వారున్నారని వివరించారు. ఎస్టీ జనాభాలో అధికశాతం కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నందున వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాల ప్రయోజనాలు అందేలాచర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. జిల్లాలో ఎస్టీవర్గాలకు 204ఇందిరమ్మ ఇళ్లుమంజూరు కాగా, ఇప్పటివరకు 46ఇళ్లనిర్మాణాలు పూర్త య్యాయని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు.
ధర్మారం మండలం నందిమేడారం గ్రామాన్ని పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద మోడల్ గ్రామంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్‌తెలిపారు. గ్రామంలోని2310ఇళ్లకు సౌర విద్యుత్‌ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు అర్హులైన ప్రతిగిరిజన కుటుంబానికి చేరేలా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ డైరెక్టర్ పి కళ్యాణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు జె అరుణ శ్రీ బి శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, గిరిజన అభివృద్ధి అధికారి సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల మర్యాదపూర్వక భేటీ
పెద్దపల్లి : పెద్దపల్లి బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె సదానందం ఆధ్వర్యంలో జాతీయషెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్‌నాయక్‌ను బీజేపీనాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోనిగిరిజనులు ఎదుర్కొం టున్న సమస్యలను కమిషన్ సభ్యులదృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్య,ఉపాధి,మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో బీజేపీ నాయకులు పర్శసమయ్య, భూషణ్, వేణి శ్రీనివాస్ గౌడ్, మోర మనోహర్, రేవెల్లి సందీప్, బండ కరుణాకర్, నూనెటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.