Peddapalli: కొండెక్కిన కోడి ధర
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:20 AM
కళ్యాణ్‌నగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కోళ్ల ధరలు కొండెక్కాయి. రెండునెలలుగా కోళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగు తుండగా, కోడి ధరలు కొండెక్కి దిగనంటున్నాయి.
కిలో బాయిలర్ చికెన్ రూ.320
నాటు కోడి కిలో రూ.650
లేయర్ కోడి రూ.250
కళ్యాణ్‌నగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కోళ్ల ధరలు కొండెక్కాయి. రెండునెలలుగా కోళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగు తుండగా, కోడి ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. దీంతో చికెన్ ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిన్న మొన్నటివరకు రూ.240కిలో చికెన్ ధర ఉండగా ఆదివారం ధరలు ఆకాశాన్నంటాయి. కోళ్లు కొరత ఏర్ప డడం, జనవరి నెలలో సమ్మక్క-సారలమ్మ జాతర రావడంతో వేలాది కోళ్లు అమ్ముడు పోయాయు. గోదా వరిఖని మార్కెట్‌కు హైదరాబాద్, తమిళనాడుతో పాటు సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చేల్ నుంచి ఇక్కడికి టన్నుల కొద్ది కోళ్లు రోజుకు దిగుమతి అవుతుంటాయి. రంజాన్‌మాసం ప్రారంభం కావడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. కిలో బాయిలర్ చికెన్ రూ.320, స్కిన్‌లెస్ రూ.340, జుట్టుకోడి రూ.250 నుంచి రూ.300ధర పలుకుతుండగా, బాయిలర్ కోడి(లైవ్) కిలోకు రూ.200ధర పలుకుతోంది. నాటు కోడి మొన్నటి వరకు రూ.500కిలో ఉండగా రూ.650లకు పెరిగింది. రంజాన్ మాసం సందర్భంగా హారీస్ సెంటర్లకు పెద్దఎత్తున చికెన్ తీసు కెళ్లడం, చుట్టుపక్కన ఉన్న పౌల్ర్టి ఫాంల నుంచి వచ్చేకోళ్లు కూడా హైదరాబాద్ వంటి నగరాలకు తర లిస్తుండడంతో ధరలు పెరిగాయి. వాస్తవానికి బాయిలర్ కోళ్లు 3నుంచి 4నెలల్లో క్రాప్‌వస్తుండగా ఈ ఏడాది సమ్మక్క-సారలమ్మ జాతర రావడం తో ఇతర పండుగలతో పౌల్ర్టిఫాంల్లో కోళ్ల కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఫ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది..
- సంపత్, చికెన్ వ్యాపారి
పౌల్ర్టీఫాంల్లో కోళ్ల కొరత ఏర్పడడంతో ధర లు ఆకాశాన్నంటాయి. పండుగలు రావడంతో కోళ్లను హైదరాబాద్‌కు ఎక్కు వగా తీసుకెళుతు న్నారు. ఒక్క రోజే కిలోకు రూ.60ధర పెరిగింది. గతంలో ఇంత ధర ఎప్పుడూ లేదు. కోళ్ల ఫాంలో క్రాప్ తగ్గడం వల్ల కోళ్ల కొరత ఏర్పడింది. ఎండా కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.