Peddapalli: పోలీసులు నిబద్ధతో పనిచేయాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:16 AM
పెద్దపల్లి టౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): అవినీతికి తావు లేకుండా పోలీసులు నిబద్దతో విధులు నిర్వ హించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
-నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
-ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి టౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): అవినీతికి తావు లేకుండా పోలీసులు నిబద్దతో విధులు నిర్వ హించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ప్రహరీ, సీసీకెమెరాలు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసులు తప్పుడు మార్గం ఎంచుకోరాదన్నారు. గతంలో ఉన్న 70సీసీ కెమెరాల్లో కొన్ని మరమ్మతులు చేయించి నూతనంగా మరో70సీసీ కెమరాలు ఏర్పాటు చేయించినట్లు తెలి పారు. వీటితో పట్టణం పోలీసుల నిఘాలోకి వెళ్లి పోయిందన్నారు. ప్రజలకు చట్టాలు, నిబంధనలపై అవగాహనకల్పించే బాధ్యత పోలీసులపై ఉంటుం దని, అందువల్ల పోలీసుసిబ్బంది ముందుగా నిబంధ నలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. పోలీస్‌కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా మాట్లాడుతూ భద్రతవిషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండా లని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించ డం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. పెద్దపల్లిలో ఒకేసారి నాలుగు పోలీస్ స్టేష న్లు మంజూరు కావడం చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. అనంతరం పలువురి పోలీసులకు హెల్మెట్లు అందజేశారు. సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరించిన వారిని సన్మానిం చారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మెన్ నూగిళ్ల మల్ల య్య, కమిషనర్ ఆకుల వెంకటేష్, డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మన్‌రావు, నరేష్, నరేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల్లో మౌలిక
సదుపాయాల కల్పనకు కృషి..
పెద్దపల్లి రూరల్ : గ్రామాల్లో ప్రజ లకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. బుధవారం మండలంలోని కాసుల పల్లి గ్రామంలో బైపాస్‌రోడ్డు నుంచి బీర ప్పస్వామి ఆలయం వరకు రూ.5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారం భించారు. అనంతరం గ్రామంలో నిర్వ హిస్తున్న బీరన్న మహోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
జూలపల్లి : మండలంలోని పెద్దాపూర్‌లో కుర్మ, యాదవ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరన్నస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుచేసిన ప్రభుత్వవిప్ విజయరమణారావు మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, నాయకులు బొజ్జ శ్రీనివాస్ పాల్గొన్నారు.
విప్‌ను కలిసిన ఉపాధ్యాయులు
ఎలిగేడు : మండలంలోని శివపల్లి గ్రామంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బాధ్యులు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి తెలం గాణ తల్లి ఫోటోను బహుకరించారు. ఈ సందర్భంగా టీఈటీ, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సమ స్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొ న్నారు.
కార్యక్రమంలో తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉమ్మడికరీంనగర్ జిల్లా బాధ్యులు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గసిగంటి శ్రీనివాస్, పెద్దపల్లిజిల్లా, రాష్ట్రబాధ్యులు దుగ్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.