Share News

Peddapalli: భారీ వర్షాలతో పోలీసులు అప్రమత్తం...

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:22 AM

కోల్‌సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తుండడంతో రామ గుండం కమిషరేట్‌ పోలీ సులు అప్రమత్తమయ్యా రు.

Peddapalli:  భారీ వర్షాలతో పోలీసులు అప్రమత్తం...

వరద ప్రాంతాల్లో పోలీస్‌ కమిషనర్‌ పరిశీలన...

సహాయ చర్యల్లో పెద్దపల్లి డీసీపీ, అధికారులు

కోల్‌సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తుండడంతో రామ గుండం కమిషరేట్‌ పోలీ సులు అప్రమత్తమయ్యా రు. కమిషనరేట్‌ పరిధిలో ని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా బుధ వారం వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్‌ ఎఫ్‌సీఎల్‌ ప్రహరీ కూలి వరద నీరు వీర్లప ల్లికి చేరడంతో ఆ ప్రాంతంలో పరిశీలిన జరిపారు. గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌, గోదావరిఖని వన్‌టౌన్‌, టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావులు సీపీ వెంట ఉన్నారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండి ఇండ్లలోకి నీరుచేరితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు 24గంటలు అందుబాటులో ఉంటారన్నారు. భారీవర్షాలతో వాగులు, వంకల్లో ఉదృతి ఎక్కువగా ఉన్నందున ఎవరూ ప్రవాహాలు దాటరాదన్నారు. ప్రాజె క్టులోకి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దన్నారు. వర్షం కారణంగా రహదా రులపై వాహనాలు అదుపు తప్పే ప్రమా దం ఉన్నందున పరిమిత వేగంతో వెళ్లాలని, అత్యవసర సమయాల్లో పోలీసులకు, 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్‌ కళాశాల, 2ఏ మోరీ, ఫైవింక్లయిన్‌ మోరీ ప్రాంతాల్లో పరిశీలన జరిపి రహ దారులను మూసివేయాల్సిందిగా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:22 AM