Share News

Peddapalli: అనాథ పిల్లలను అక్కున చేర్చుకోండి

ABN , Publish Date - May 30 , 2026 | 12:26 AM

సుల్తానాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయిన, విధి వంచితులైన అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారికి ఏలోటూ రాకుండా చూసుకోవాలని ప్రభుత్వ

 Peddapalli:  అనాథ పిల్లలను అక్కున చేర్చుకోండి

- ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

సుల్తానాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయిన, విధి వంచితులైన అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారికి ఏలోటూ రాకుండా చూసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలో నిర్మించిన అనాథపిల్లల జిల్లా స్థాయి భవనాన్ని ఆయన శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన బాలసదన్‌లో ఉన్న అన్నివిభాగాలను పరిశీలించారు. పక్కనే ఉన్న జిల్లాస్థాయి వృద్ధుల ఆశ్రమాన్ని కూడా సందర్శించి వృద్ధుల బాగోగులను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాస్థాయిలో సుల్తానాబాద్‌లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన అనాథపిల్లల వసతిగృహంలో వారికి ఏలోటు లేకుండా సంర క్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల ప్రేమను చూపాలన్నారు. ఇక్కడ ఏంఅవసరమైన తనకు సమాచారం ఇస్తే వాటిని సమకూర్చేం దుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ బిరుదు రాధా క్రిష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత, కౌన్సిలర్‌ చింతల రాజు, పలువురు జిల్లాస్థాయి అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పెద్దమ్మగుడిలో ప్రభుత్వవిప్‌ ప్రత్యేక పూజలు..

కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని లక్ష్మిపురంలో ముదిరాజు కుల స్తులు పెద్దమ్మతల్లి బోనాలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో నియోజకవర్గంలో సంతు ష్టిగా వర్షాలుపడి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్‌ మేకల లావణ్య జనార్దన్‌ రెడ్డితోపాటు ముదిరాజు నాయకులు ఆయనను సన్మానించారు.

Updated Date - May 30 , 2026 | 12:26 AM