Share News

Peddapalli: ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు రూపొందించాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:32 AM

పెద్దపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌కు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొం దించాలని అధికారులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

 Peddapalli:  ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు రూపొందించాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌కు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొం దించాలని అధికారులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుఽధవారం తన ఛాం బర్‌లో కలెక్టర్‌ పౌరసరఫరాలశాఖ పనితీ రుపై సంబంధిత అధికారులతో నిర్వహిం చిన సమీక్షలో మాట్లాడారు. ఈ యాసంగి సీజన్‌లో 4.50లక్షలమెట్రిక్‌టన్నుల ధాన్యా న్ని 334కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేం దుకు అవసరమైన చర్యలు చేపట్టాల న్నారు. కోటి12లక్షల 59వేల గన్నీ సంచు లు అవసరమని, వాటిని సిద్ధం చేసు కోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలి కవసతులు కల్పించాలన్నారు.

2024-25 వానాకాలం సీజన్‌లో వంద శాతం, యాసంగిలో 93శాతం,గడిచిన వానాకాలం సీజన్‌కు సంబంధించి 28శాతం సీఎంఆర్‌ పూర్తయ్యిందన్నారు. 2014-15నుంచి 2023-24వరకు సీఎంఆర్‌ బకాయిపడిన 48రైసు మిల్లులను గుర్తించి గతపదిరోజులలో 2కోట్ల18 లక్షల రూపాయ లను డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్ల నుంచి వసూలు చేశామన్నారు. పెండింగ్‌ బకా యిలు త్వరగా చెల్లించాలని, లేకుంటే డిఫాల్ట్‌ అయిన మిల్ల ర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. జిల్లాలో ఇప్పటి వరకు 5రైస్‌ మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి రెవెన్యూరికవరీ చట్టం అమలు చేస్తున్నా మని, మిగిలిన మిల్లులపై కూడా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌వో కె శ్రీనాథ్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ ఎం శ్రీకాంత్‌ రెడ్డి, తదిత రులు పాల్గొన్నారు.

ఫ జిల్లాలో సమృద్ధిగా

ఎల్‌పీజీ సిలిండర్లు..

జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లు సమృ ద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అన వసర ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. రెండు రోజులలో సరాసరి కంటే 40శాతం అధికంగా గ్యాస్‌బుకింగ్‌ జరిగా యని, ప్రజలు భయాందోళనలతో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయవద్దని సూచించారు. మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తున్నామని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్ల స్టాక్‌ను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ప్రజలు అనవసర ఆందోళనలకు గురికా వద్దని పేర్కొన్నారు. ఎల్‌పీజీ సిలిండర్లను ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు ఉంటా యని హెచ్చరించారు.

జిల్లాలో ఇప్పటివరకు 12కేసులు నమోదు చేసి 29సిలిం డర్లు సీజ్‌చేశామని తెలిపారు. జిల్లాలో 15డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ద్వారా గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ జరుగుతుం దని వాటి డెలివరీలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే జిల్లాలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ హెల్ప్‌లైన్‌ నంబరు08728 224045ను సంప్రదించాలని సూచించారు. ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దన్నారు. గృహ వినియోగానికి, ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థ లకు సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాం గం సన్నద్ధ్దంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:32 AM