Peddapalli: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:14 AM
పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్, సెప్టెం బరు 21 (ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్, సెప్టెం బరు 21 (ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన.. అదనపుకలెక్టర్ శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. ప్రజలు అందించిన అర్జీ లను పరిశీలించి, వాటిపరిష్కారాని కి అధికారులకు ఆదేశాలు జారీచే శారు. రామగుండం మండలం గోదావరిఖని సిక్కువాడకు చెందిన మేదరి లలిత తనకూతురు మేదరి సౌజన్య తనపేరుమీద ఉన్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని తమబాగోగులు చూసు కోకుండా ఇంటినుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేస్తోందని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఆర్డీవో పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన పైడిపండ్ల తిరుపతమ్మ గృహజ్యోతి పథకంలో 200యూనిట్ల ఉచితవిద్యుత్ సబ్సిడీ అమలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఎంపీడీవో పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కమాన్‌పూర్ మండలానికి చెందిన చాట్ల అనూష తాము నిరుపేద కుటుంబానికి చెందినవారమని, తమకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరుచేయాలని దరఖాస్తు చేసుకు న్నారు. ఈ దరఖాస్తును పీడీ హౌసింగ్‌కు రాస్తూ పరిష్కరించాలని సూచించారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
పెద్దపల్లి : ఖరీఫ్2026సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్ బి శ్రీరాములుతోకలిసి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఎంత మొత్తంలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందో సమగ్ర అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ కొనుగోలు కేంద్రంలోనూ అవసరమైన సామగ్రి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎస్‌డబ్ల్యూసీ రీజినల్ మేనేజర్,అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలి
పెద్దపల్లి : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రామీణప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మురుగుకాలువల్లో చెత్త, పూడిక పేరుకు పోకుండా చర్యలు చేపట్టాలన్నారు. కోతుల, కుక్కలబెడద ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి, సంబంధితశాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి వన రులు, సరఫరావ్యవస్థలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటినాణ్యతను నిర్ధారించాలని తెలి పారు. సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా సమస్యలపై ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీమాల, ఎంపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.