Share News

Peddapalli: పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి: మేయర్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:44 AM

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తుందని, ప్రజలు కూడా తమ వంతు భాధ్యతగా చెత్త బయట పడవేయకుండా

Peddapalli:  పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి: మేయర్‌

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తుందని, ప్రజలు కూడా తమ వంతు భాధ్యతగా చెత్త బయట పడవేయకుండా పారిశుధ్య నిర్వహణకు నగరపాలక సంస్థకు సహకరిం చాలని మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. వార్డు బాటలో భాగంగా బుధవారం రామ గుండం నగరపాలక సంస్థ 3వ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్‌ వడ్లూరి రవి, అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఎక్సావేషన్‌, చైన్‌ ఎక్సావేషన్‌, బాబ్‌ కాట్‌ యంత్రాలతో పెద్ద మురుగు నీటి కాలువలో పూడిక తొలగించారు. ఈ పను లను మేయర్‌ స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈపీవీ రామన్‌ , డీఈఈలు అఫ్తాబ్‌, జగదీష్‌, షాబాజ్‌, ఎఈలు పాలొ ్గన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:44 AM