Peddapalli: బాలసదన్‌ను సందర్శించిన పెద్దపల్లి జడ్జి భవాని
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:18 AM
సుల్తానాబాద్, జూన్ 27 (ఆంధ్ర జ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో ఇటీ వల ప్రారంభించబడిన బాలసదన్‌ను శనివారం పెద్దపల్లి జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి,
సుల్తానాబాద్, జూన్ 27 (ఆంధ్ర జ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో ఇటీ వల ప్రారంభించబడిన బాలసదన్‌ను శనివారం పెద్దపల్లి జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి, పెద్దపల్లి సబ్‌కోర్డు జడ్జి వంగర భవాని సందర్శించారు. బాలసదన్‌తోపాటు వృద్ధాశ్రమం, మాన సిక వికలాంగుల స్కూల్‌ను కూడా సంద ర్శించి వారితో మాట్లాడారు. ఆశ్రయం పొందిన వారందిరితో జడ్జి ఆత్మీ యతతో వారి మధ్య గడిపారు. వృద్ధాశ్రమ నిర్వా హకులు సక్రమంగా అన్ని వసతులు, సౌకర్యాలు, ఆహారాన్ని కల్పిస్తున్నారా అని ప్రశ్నిం చారు. వారి సమాధానాన్ని బట్టి నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందించారు. బాలసదన్‌లో స్టాక్ రిజిస్టర్లను, పిల్లలకు అందించే మెనూను పరిశీలించారు. పిల్లలకు సరైన ఆహారాన్ని అందించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా న్యాయసేవాధికార సంస్థను కానీ జిల్లా సంక్షే మశాఖ అధికారులకు తెలిపినట్లయితే సమస్య పరిష్కారం కోసం వీలు కల్పిస్తామన్నారు.