Peddapalli: బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి
ABN , Publish Date - May 31 , 2026 | 12:44 AM
పెద్దపల్లి కల్చరల్, మే 30 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాను బాల్యవివాహాలరహిత జిల్లాగా ప్రకటిస్తు న్నట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
- కలెక్టర్ కోయశ్రీహర్ష
పెద్దపల్లి కల్చరల్, మే 30 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాను బాల్యవివాహాలరహిత జిల్లాగా ప్రకటిస్తు న్నట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. శనివారం కలెక్ట రేట్‌లో స్నేహ కిషోరబాలికల సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన మాక్‌పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాలొ ్గని మాట్లాడారు. జిల్లాలో బాల్యవివాహాల నిర్మూనలతో పాటు మహిళా సాధికారిత, అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన కార్యక్రమాలు విశేషఫలితాలను సాధించాయ న్నారు. జిల్లాలోని మహిళా సంఘాలలో చదువురాని మహిళలను ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదుచేసి 5వేలమంది వలంటీర్లతో అక్షరాస్యత కార్యక్రమం నిర్వ హించినట్లు తెలిపారు. మార్చిలో పరీక్షలకు 34,620 మంది మహిళలు పాల్గొని వందశాతం ఉత్తీర్ణత సాధిం చడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాబోయే జూలైలో మిగిలిన 35వేల మంది మహిళలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్, 14 మండ లాల పరిధిలోని 263గ్రామపంచాయతీలలో ఎక్కడా బాల్య వివాహాలు జరగలేదని ధ్రువీకరించి, జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆయన ప్రకటించారు. అనంతరం మహిళల భద్రత, గౌరవ పరిరక్షణకు కట్టు బడి పనిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లాగ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అదనపు గ్రామీణ అభివృద్ది అధికారి రవీందర్, సంబంధిత అధికారులు, స్నేహకిషోర బాలికల సంఘంసభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన యువతీ,
యువకులకు ఉచిత
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తున్న ట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలి పారు. ఇందులో ప్రధానంగా ఐటీఈఎస్, లాజిస్టిక్స్, టెలికాం, వ్యవసాయం, గృహోపకరణ, దుస్తుల తయారీ, అందం, సంర క్షణ, టూరిజం, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎలక్ర్టానిక్స్, హెల్త్ కేర్, తదితర రంగాల్లో నైపుణ్యా లను అందిస్తారని, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని, అలాగే 94411 74822 నంబర్‌లో పూర్తి వివ రాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి
పెద్దపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): జనాభా గణన 2027లో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. జిల్లాకలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం తనక్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హౌస్‌లిస్టింగ్ సర్వేలో పాల్గొని ఎన్యూమరేటర్‌కు అవసరమైన వివ రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ కోయశ్రీహర్ష మాట్లా డుతూ హౌస్‌లిస్టింగ్ సర్వే జనాభా గణన 2027లో అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. ప్రతిఇంటి నిర్మాణం, గృహసౌకర్యాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్, వంట ఇంధనం, కమ్యూని కేషన్ సౌకర్యాలు తదితర వివరాలను ఈ సర్వే ద్వారా నమోదు చేస్తారని చెప్పారు. ఈ సమాచారంతో ఏ సంక్షేమ పథకం రద్దుకావడం గానీ, లబ్ధిదారుల అర్హ తలు ప్రభావితమవడం గానీ జరగదని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులు నిబంధనలప్రకారం ప్రతిఇంటిని సంద ర్శించి వివరాలను నమోదుచేయాలని, సర్వేను పారద ర్శకంగా, నాణ్యతతోనిర్వహించాలనికలెక్టర్ ఆదేశించారు.