Peddapalli: మన ప్రాణం.. రక్షణ.. బాధ్యత మనదే
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:09 AM
పెద్దపల్లిటౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మన ప్రాణం.. రక్షణ.. బాధ్యత మనమీదే ఉంటుందని దానిని కాపాడుకుంటూ కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు.
-ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
-జిల్లా జడ్జీ కుంచాల సునీత
పెద్దపల్లిటౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మన ప్రాణం.. రక్షణ.. బాధ్యత మనమీదే ఉంటుందని దానిని కాపాడుకుంటూ కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు. గురువారం ఐటీఐ మైదానంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ, మున్సిపల్, కోర్టు, ట్రాఫిక్‌పోలీస్, హెచ్కేఆర్, ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీవో రంగారావుతో కలిసి ప్రసంగించారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరుగవన్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధశాఖల పోస్టర్లు ఆవిష్కరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బైక్‌ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏసీపీ గజ్జికృష్ణ, ఆర్డీవో గంగయ్య, పీపీ డొంకెన రవీందర్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సీఐలు ప్రవీణ్‌కుమార్, అనిల్‌కుమార్, ఎస్సై మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్: ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సుల్తానాబాద్ కోర్టుజడ్జి దుర్గం గణేష్ తెలిపారు. గురు వారం మండల న్యాయసేవాధికారి సంస్థ, ట్రాఫిక్ పోలీస్, జిల్లారవాణా అధికార సంస్థ సంయుక్తంగా రహదారి భద్రతపై కోర్టునుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. డ్రైవింగ్ సమయంలో మోబైల్ వాడవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఆర్టీవో రంగారావు, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ సహదేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ రమేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి..
కోల్‌సిటీ: ట్రాఫిక్‌నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని జిల్లా6వ అదనపున్యాయమూర్తి శ్రీనివాస రావు అన్నారు. రోడ్డుభద్రత మాసోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా న్యాయసేవాధి కార సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా గురు వారం నిర్వహించిన అవగాహనసదస్సు, ర్యాలీని ఆయ న ముఖ్యఅతిథిగాహాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదరహిత సమాజనిర్మాణం కోసం కృషి చేయాల న్నారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లా డుతూ ఎక్కువమంది యువకులు రాష్, ట్రిపుల్ రైడ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఇందులో ఎక్కువమంది మైనర్లు ఉన్నారన్నారు. విద్యార్థిదశ నుంచి రోడ్డుభద్రత, ట్రాఫిక్‌రూల్స్ పాటిస్తూ కుటుంబసభ్యులకు, బంధువులు అందరూ పాటించేలా వారికి ట్రాఫిక్ నియమనిబంధనలపై చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో సెషన్‌కోర్టు న్యాయమూర్తి సూరత్‌రాజ్‌సింగ్, వెంకట్ సచిన్‌రెడ్డి, న్యాయమూర్తులు వెంకట్ సచిన్‌రెడి, వెంకటేష్ దుర్వ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, గోదావరిఖని వన్‌టౌన్‌సీఐ ఇంద్రసేనా రెడ్డి, ట్రాఫిక్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..
కోల్‌సిటీటౌన్: రోడ్డు భద్రత ప్రతి క్కరి బాధ్యత అని మండల న్యాయవిభాగం అధ్యక్షుడు, సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. గోదావరిఖని కోర్టు ఆవరణ, ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గురువారం రామగుండం ట్రాఫిక్‌పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతా, న్యాయఅవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మానికి ముందు విద్యార్థులు కళాశాల ఆవరణలో పోస్టర్లు ఆవిష్కరించి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ రాజేశ్వరరావు, ఎస్‌ఐ హరిశేఖర్, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ కెడెట్లు పాల్గొన్నారు.