Peddapalli: చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలి..
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:32 AM
సుల్తానాబాద్, సెప్టెంబరు 19 (ఆంద్ర జ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పైనా ఆసక్తి పెంచుకోవాలని డీవైఎస్‌వో అక్క పాక సురేష్ అన్నారు.
డీవైఎస్‌వో సురేష్
సుల్తానాబాద్, సెప్టెంబరు 19 (ఆంద్ర జ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పైనా ఆసక్తి పెంచుకోవాలని డీవైఎస్‌వో అక్క పాక సురేష్ అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్‌కళాశాల మైదానంలో నిర్వహించిన జోనల్‌స్థాయి అథ్లెటిక్స్ పోటీల సందర్భంగా శనివారం వారు మాట్లాడారు. జోన్‌పరిధిలోని నాలుగు మండలాల నుంచి బాలబాలికలు ఈపోటీల్లో పాల్గొని వివిధఅథ్లెటిక్స్ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. విద్యార్థులు ఉత్సా హంగా పోటీపడి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవా లని సూచించారు. ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొ న్నారు. అనంతరం విజయం సాధించిన క్రీడాకారులకు వారు బహుమతులు అంద జేశారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ జోనల్ కన్వీనర్ దాసరి రమేష్, మండల కన్వీనర్ తాండ్ర ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థు లు, క్రీడాకారులు పాల్గొ న్నారు.
ఫకబడ్డీ ఎంపిక
పోటీలకు
విశేష స్పందన
కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్‌జూనియర్ జూనియర్ బాల బాలికలజట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. శనివారం సుల్తానాబాద్‌లోని అల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీ లకు జిల్లావ్యాప్తంగా 300మంది బాలబాలి కలు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాజట్టుకు ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మయ్య, కరుణాకర్‌రెడ్డి తెలి పారు. కార్యక్రమంలో అల్ఫోర్స్‌ప్రిన్సిపాల్ స త్యం, పీడీలు, దాసరి రమేష్, ప్రణయ్, దాసరి ప్రసాద్, ఆలేటిసంపత్, గెల్లుమధుకర్ యాద వ్, మహమ్మద్‌షఫీ, కిషోర్,రాజేందర్ ప్రసా ద్, శివ, పిట్ట భాస్కర్ తదితరులున్నారు.