Share News

Peddapalli: ఓదెల సబ్‌జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాళం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:20 AM

ఓదెల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ఓదెల సబ్‌ జూనియర్‌ సివిల్‌కోర్టు భవనానికి సోమవారం భవన యజమాని తాళం వేయడంతో కలకలం రేగింది.

Peddapalli: ఓదెల సబ్‌జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాళం

- అద్దె బకాయిలు చెల్లించడం లేదన్న యజమాని

- కొద్దిసేపు నిలిచిన కోర్టు కార్యకలాపాలు

ఓదెల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ఓదెల సబ్‌ జూనియర్‌ సివిల్‌కోర్టు భవనానికి సోమవారం భవన యజమాని తాళం వేయడంతో కలకలం రేగింది. ఉదయం పూట కొద్దిసేపటి వరకు కోర్టు కార్య కలాపాలు నిలిచిపో యాయి. రెండు రోజుల్లో అద్దె డబ్బులు ఇప్పిస్తామని కోర్టు అధికారులు హామీ ఇవ్వడంతో యజమాని తాళాలు తీశాడు. అనంతరం భవన యజమాని ముంజాల మధు మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన సబ్‌ జూనియర్‌ సివిల్‌కోర్టుకు తన భవనాన్ని అద్దెకు ఇచ్చానని చెప్పారు. 2025ఏప్రిల్‌ 19వ తేదీన కోర్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.3.65లక్షల నెలవారీ అద్దె బిల్లులు ఇవ్వకపోవడంతో పాటు దాదాపు 25వేల రూపాయల విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించడం లేదని మధు తెలిపారు. ఈసమస్యపై ఇప్పటికే జిల్లా కోర్టుతోపాటు హైకోర్టుకు కూడా లేఖలద్వారా పలుమార్లు విజ్ఞప్తిచేశానన్నారు. మూడు సార్లు సంబంధిత అధికారులకు గడువు ఇచ్చినా ప్రభుత్వం గానీ, న్యాయ శాఖ అధికారులు గానీ స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చివరి మార్గంగా కోర్టు భవనానికి తాళం వేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించి అద్దె బకాయిలు చెల్లించాలని కోరారు.

Updated Date - Jul 02 , 2026 | 12:21 AM