Share News

Peddapalli: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:33 PM

మండలాల్లో గురువారం నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి.

Peddapalli:  ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఓదెల/పెద్దపల్లి రూరల్‌/ఎలిగేడు/సుల్తానాబాద్‌/పాలకుర్తి/అంతర్గాం/మంథని, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మండలాల్లో గురువారం నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. వివిధ గ్రామాల్లో యువతీ యువకుల కేరింతలతో 2025కు వీడ్కోలు పలుకుతూ, 2026ని స్వాగతిస్తూ బాణసంచాలను పేల్చి సంబరాలు నిర్వహించారు. అలాగే ప్రతి ఇంటి ముంగిట మహిళలు రంగవల్లులతో వాకిళ్లను అలం కరించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు ఎమ్మెల్యే, విజయ రమణారావు అలాగే మాజీఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి కూడా గతంలో కంటే ఎక్కువ గ్రామాల్లో మద్యం విందులు అధికంగా నిర్వహించారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, పోలీసులు మందు బాబుల హంగామాకు అడ్డుకట్ట వేశారు. పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామంలో గ్రామసర్పం చ్‌ జూపాక శ్వేత-వెంకటేష్‌ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సుల్తానాబాద్‌లో స్థానిక యాదవ నగర్‌లో మహిళా రైతులు తమ పొలాలవద్ద నాట్ల పనులు చేస్తూనే కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకు న్నారు. అధికారులకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసాలతక్కళ్లపల్లి గ్రామం లోని సమ్మక్క,సారలమ్మల గద్దెల వద్ద మహిళలు ఏకరూప దుస్తులతో కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకోవడం పలువురిని ఆకట్టుకుంది.

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ:గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. గురువారం కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌర స్తాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ సతీమణి మనాలీ ఠాకూర్‌ హాజరై కేక్‌కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో కాలనీవాసులతో కలిసి మనాలీ ఠాకూర్‌ కేక్‌కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బొంతల రాజేష్‌, కాల్వ లింగ స్వామి, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్‌, నాయిని ఓదెలు, గట్ల రమేష్‌, చుక్కల శ్రీనివాస్‌, ముస్తాఫా, ఆరె శ్రీనివాస్‌, శివ, దాసరి విజయ్‌, స్వప్న, అశోక్‌, దాసరి ఉమాదేవి, సాంబమూర్తి పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ కార్యాల యంలో జరిగిన నూతన సంవత్సరవేడుకలకు రామ గుండం మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపు ఐలయ్య, నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, ఇరుగురాళ్ల శ్రావణ్‌, కోడిరామకృష్ణ, పాలడుగుల కనకయ్య పాల్గొన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షులు దేవరనేని మాధవరావు ఆధ్వర్యంలో నూతనసంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా జర్నలిస్టులు కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్‌కుమార్‌, సీనియర్‌ జర్నలిస్టులు మాదాసు రామమూర్తి, అల్లెంకి లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ/ జ్యోతినగర్‌: యైుటింక్ల యిన్‌ కాలనీ తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోరామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో నూతనసంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఎన్‌టీపీసీ ప్రాజెక్టు పాలన భవనంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత కేక్‌కట్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ఉద్యోగ లంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన రామ గుండంను మరింత ముందుకు తీసు కెళ్లేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ వేడుకల్లో ప్రాజెక్టుకు చెందిన పలు విభాగాల బీఎంలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:33 PM