Peddapalli: దేశంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన నరేంద్రమోదీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:00 AM
గోదావరిఖని, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, నీట్‌పరీక్షల పేపర్ లీకేజీలే దీనికి నిదర్శన మని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆరోపించారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, నీట్‌పరీక్షల పేపర్ లీకేజీలే దీనికి నిదర్శన మని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆరోపించారు. బుధవారం రామగుండం ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీ క్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు విద్యార్థు లపై పడుతున్న మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి వల్ల 3వేలమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా ర్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కేంద్ర ప్రభుత్వా నికి బుద్ధిచెప్పి గద్దె దింపాల న్నారు. విద్యార్థుల భవిష్యత్ లో దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన పరీక్షవిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో విద్యార్థు లను, వారి కుటుంబాలను కాంగ్రెస్‌కలిసి వారికి మనో ధైర్యాన్ని అందివ్వనున్నట్టు చెప్పారు. సమావేశంలో మేయర్ మహంకాళిస్వామి,డిప్యూటీమేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగరఅధ్యక్షుడు బొంతల రాజేష్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, ఆసిఫ్, ఉదయ్‌రాజ్, వంశీ, రంజిత్, దాసరివిజయ్, కొప్పులశంకర్ పాల్గొన్నారు.