Share News

Peddapalli: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:57 PM

కోల్‌సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో పోలీసులు ఎళ్లప్పుడూ అప్ర మత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు.

Peddapalli:  విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బందికి రెయిన్‌కోట్లను అందజేసిన సీపీ

కోల్‌సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో పోలీసులు ఎళ్లప్పుడూ అప్ర మత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. బుధవారం సీపీ కార్యాలయంలో పోలీస్‌సిబ్బందికి రెయిన్‌ కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని, రానున్న వర్షాకాలం దృష్ట్యా విధులు నిర్వహించే సిబ్బందికి రెయిన్‌ కోట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమా నికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎండనక, వాననక కష్టపడి విధులు నిర్వహించే సిబ్బందికి ఈరెయిన్‌కోట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సిబ్బంది ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధచూపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్‌) ఏ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు శేఖర్‌, మల్లేషం, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:57 PM