Peddapalli: విద్యార్థులకు ’మిషన్ టెన్త్‘ ఒక గొప్ప వరం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:49 AM
ముత్తారం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ’మిషన్ టెన్త్‘ ఒక గొప్ప వరమని ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్రావు అన్నారు.
ముత్తారం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ’మిషన్ టెన్త్‘ ఒక గొప్ప వరమని ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచెస్ పాఠశాలలో శ్రీరామ్‌లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ’మిషన్ టెన్త్‘ పోస్టర్‌ను సర్పంచ్ సుధాటి రవీందర్రావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రవికుమార్ వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనం తరం సంస్థ ఏజీఎం వెంకట్‌రాజామ్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.2.2కోట్ల నగదు బహు మతులు అందజేస్తున్నామని, రాష్ట్ర టాపర్‌కు రూ.5 లక్షలు, జిల్లా టాపర్‌కు రూ.2లక్షలు, నియోజకవర్గ, మండలస్థాయి టాపర్లకు కూడా భారీగా నగదు పురస్కారాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీచైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.