Share News

Peddapalli: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:04 AM

ధర్మారం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ముందు తన కుటుంబంలో ఉన్న అక్రమాస్తుల పంచాయితీని పరిష్కరించుకున్నాకే ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సూచించారు.

Peddapalli: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

ధర్మారం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ముందు తన కుటుంబంలో ఉన్న అక్రమాస్తుల పంచాయితీని పరిష్కరించుకున్నాకే ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని, మేడారం, చామనపల్లి గ్రామాల్లో వరిధాన్యపు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పోయి బీఆర్‌ఎస్‌ రావాలని హరీష్‌రావుతో పాటు కొత్తగా బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి మాట్లా డడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ పెట్టేంతా డబ్బు కవిత దగ్గర ఎక్కడిదో చెప్పాలని డిమాం డ్‌ చేశారు. మార్క్‌ఫెడ్‌ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం చివరి గింజవరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. చామనపల్లిలో కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయిం పునకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్‌ రూప్లానాయక్‌, వైస్‌చైర్మెన్‌ అరిగెలింగయ్య, కాంగ్రెస్‌ నాయకులు కొడారిఅంజన్న, కొత్తనర్సింహులు, దేవి జనార్ధన్‌, ఏఎంసీ డెరెక్టర్లు, వివిద గ్రామాల సర్పంచులు, ఎంపీడీఓ వేముల సుమలత, ఏఎంసీ సెక్రెటరీ సరోజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 01:04 AM