Share News

Peddapalli: రన్నింగ్‌తో మానసిక ప్రశాంతత

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:20 AM

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రన్నింగ్‌తో మానసిక ప్రశాంతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని రామగుండం మేయర్‌ మహంకాళిస్వామి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు.

 Peddapalli:  రన్నింగ్‌తో మానసిక ప్రశాంతత

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రన్నింగ్‌తో మానసిక ప్రశాంతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని రామగుండం మేయర్‌ మహంకాళిస్వామి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో హైదరాబాద్‌కు చెందిన సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్నర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే, 5కే, 10కే పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు ఆరోగ్యం కోసం రన్నింగ్‌ చేయాలని, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఫిట్‌ తెలంగాణకు గోదావరిఖనినుంచి మొదటి అడుగు ప్రారంభమైందని, జూన్‌ 7న హైదరాబాద్‌ నక్లెస్‌ రోడ్‌లో జరిగే ఫైనల్‌ రన్‌లో ఓపెన్‌ క్యాటగిరిలో గెలుపొందిన వారికి రూ.3లక్షల బహుమతి అందజేయనున్నట్టు తెలిపారు.

ఉత్సాంగంగా ప్రారంభమైన ఈ రన్‌లో గెలుపొందిన వారికి మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌జీ-2 ఎస్‌ఓటూ జీఎం రాములు, సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్నర్స్‌ అధ్యక్షులు సోమ జగన్మోహన్‌రెడ్డి, హరీష్‌, రవి, సదాయశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు సాన రామకృష్ణరెడ్డి, లింగమూర్తి, కేఎస్‌ వాసు, చంద్రమౌళి, శంకర్‌, జబ్బార్‌ఖాన్‌, సోమారపు అరుణ్‌కుమార్‌, లావణ్య, డాక్టర్‌ వనజ రాపోలు, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:20 AM