Share News

Peddapalli: యోగాతోనే మానసిక, శారీరక ఆరోగ్యం

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:06 AM

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆయూష్‌ విభాగం, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో

Peddapalli:  యోగాతోనే మానసిక, శారీరక ఆరోగ్యం

- ప్రభుత్వవిప్‌ చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆయూష్‌ విభాగం, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌ అనే ఇతి వృత్తంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌కళాశాల మైదానంలో నిర్వ హించారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేసి అంతర్జా తీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ప్రభుత్వవిప్‌ ఎమ్మెల్యే విజయ రమణారావుకి మొక్క అందజేసిన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి, యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అనేది యోగాకు పుట్టినిల్లని అన్నారు. ప్రపంచదేశాల్లో యోగా చేయడం మన దేశానికి గర్వకారణమన్నారు. యోగాద్వారా ఒత్తిడిలేని, ఆర్యోగకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, అనా రోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. యోగా ఆరోగ్య జీవన విధానానికి మానసిక స్థిరత్వా నికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సి పల్‌ చైర్మన్‌, జిల్లా వైద్యాధికారి, డీసీపీ, పోలీస్‌ అధి కారులు, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, మున్సి పల్‌ కమిషనర్‌, యోగా పండితులు, పలుశాఖల అధి కారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, యోగాభిమానులు పాల్గొన్నారు.

ఫ ఒత్తిడి తగ్గుతుంది..

- రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

కోల్‌సిటీ : నిత్యజీవితంలో యోగాను భాగ స్వామ్యం చేసుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ప్రపంచయోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. యోగా అనేది ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతిఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచిం చారు. ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్‌సిబ్బందిని అభి నందించారు. యోగా దినోత్సవానికే పరిమితం చేయ కుండా ప్రతి 15రోజులకోసారి శాఖస్థాయిలో ఇంటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిబ్బం దిలో అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు చెందిన యోగా శిక్షకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) శ్రీనివాస్‌, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌గౌడ్‌, గోదావరిఖని వన్‌టౌన్‌-2 ఇన్‌స్పెక్టర్‌ అఫ్జలు ద్దీన్‌, రామగుండం సీఐ కృష్ణ కుమార్‌, ఆర్‌ఐలు దామోదర్‌, మల్లేషం, శేఖర్‌, యోగా శిక్షకురాలు రాధిక పాల్గొన్నారు.

ఫ ఆరోగ్యకర జీవనం సాధ్యం

- ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత

జ్యోతినగర్‌ : నిత్యం యోగా సాధనతో ఆరోగ్యకర మైన జీవనం సాధ్యమవుతుందని రామగుండం, తెలం గాణ ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. అంతర్జాతీయ యోగాడే దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఆదివారం పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరియంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పలు వురు ఉద్యోగులు, సిబ్బందితో కలిసి యోగా చేశారు. అనంతరం మాట్లాడుతూ యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన కార్యక్రమాలలో భాగం చేసుకోవాలని కోరారు. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక, సమతుల్యం సాధ్యమవుతుందన్నారు. అలాగే యోగా సాధనవల్ల రుగ్మతులకు దూరంగా ఉండవచ్చ న్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ గురువులు రమణప్రసాద్‌, మాధవి, ఎన్టీపీసీ ఉద్యో గులు, అధికారులతో యోగా సాధన చేయించారు. ప్రధాని మోదీ యోగా సందేశాన్ని లైవ్‌లో తిలకిం చారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికా రులు, విద్యార్థులు, గృహిణులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:06 AM