Share News

Peddapalli: సమష్టి కృషితోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవంతం

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:33 AM

పెద్దపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): న్యాయశాఖ, పోలీస్‌ శాఖాధికారుల సమష్టి కృషి తోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవం తం అయిందని జిల్లాజడ్జి సునీత కుంచాల అన్నారు.

Peddapalli: సమష్టి కృషితోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవంతం

- జిల్లా జడ్జి సునీత కుంచాల

పెద్దపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): న్యాయశాఖ, పోలీస్‌ శాఖాధికారుల సమష్టి కృషి తోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవం తం అయిందని జిల్లాజడ్జి సునీత కుంచాల అన్నారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గతనెలలో నిర్వ హించిన మెగాలోక్‌ అదాలత్‌ విజయవంతానికి కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బం దిని ఆమె అభినందించి, ప్రశంసాప త్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లా డుతూ వివిధ రకాల పెండింగ్‌ కేసులను పరస్పర అవగాహనతో త్వరగా పరిష్కరించడంలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ముఖ్యం గా ప్రజలకు న్యాయం త్వరగా అందేవిధంగా పోలీసుశాఖ చేసిన కృషిని కొనియాడారు. భవిష్య త్తులో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని సూచించారు. డీసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కార్యక్ర మంలో అధికసంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయపరంగా సహకరించిన న్యాయశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి, కె స్వప్న రాణి, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి వి భవాని, జూనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌ మంజుల, పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు గజ్జి కృష్ణ, మడత రమేష్‌, సీఐలు ప్రవీణ్‌ కుమార్‌, రాజు, ఏపీపీ పి రాకేష్‌, ఎస్సైలు, పలువురు న్యాయ మూర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:33 AM