Share News

Peddapalli: చామనపల్లి గ్రామ పునరావాసానికి చర్యలు చేపడుతాం

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:32 AM

ధర్మారం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామనపల్లి గ్రామ పునరావా సానికి చర్యలు చేపడుతామని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలిపారు.

Peddapalli:  చామనపల్లి గ్రామ పునరావాసానికి చర్యలు చేపడుతాం

ధర్మారం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామనపల్లి గ్రామ పునరావా సానికి చర్యలు చేపడుతామని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలిపారు. మండలంలోని నంది రిజర్వా యర్‌తో ముంపునకు గురువు తున్న చామనపల్లి గ్రామాన్ని పునరావాస కమిషనర్‌ శివకు మార్‌, కలెక్టర్‌ కోయశ్రీహర్ష, సంబంధిత శాఖ అధికారులు గురువారం సందర్శించారు. సంబంధిత అధికారులతో కలిసి కమిషనర్‌, కలెక్టర్‌ కాలినడకన గ్రామంలో కలియతిరుగుతూ పరిస్థితు లను క్షుణ్ణంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల వల్ల కలుగుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ ఇప్ప టికే గ్రామప్రజలు పలుమార్లు వినతులు సమర్పిం చారని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ ద్వారా అందిన ప్రజల వినతుల మేరకు చామనపల్లి గ్రామంలో భూసేకరణ అంశాన్ని పరిశీస్తున్నామని భూసేకరణ, పునరావాస కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామపరిస్థితులను పరిశీ లించి, ప్రజాఅభిప్రాయాలను తెలుసుకొని, ప్రభు త్వానికి నివేదిక సమర్పిం చేందుకు ప్రభుత్వం తనను పంపించిందని శివకుమార్‌ తెలిపారు. గ్రామ సంద ర్శన అనంతరం గ్రామంలోని సుమారు 140ఇళ్లు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. పునరావాస కాలనీని అభివృద్ధి చేసి అర్హులైన వారికి ఇంటి స్థలాలు కల్పించడంతోపాటు 18సంవత్సరాలు నిండిన అర్హులైన వారికి నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు చేపడుతామని అన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు గుప్త ఆర్డీవో గంగయ్య, సర్పంచ్‌ వేల్పుల రేవతి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:32 AM