Peddapalli: ప్రభుత్వ నిర్బంధ వైఖరికి వ్యతిరేకంగా సామూహిక దీక్షలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:45 AM
పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్బంధ, అణిచివేత వైఖరికి వ్యతిరేకంగా సీఐ టీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో సామూహిక నిరసనదీక్షలు నిర్వహిం చారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్బంధ, అణిచివేత వైఖరికి వ్యతిరేకంగా సీఐ టీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో సామూహిక నిరసనదీక్షలు నిర్వహిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య హక్కు లపై దాడేనని విమర్శించారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమానికి రైతుసంఘం జిల్లా బాధ్యులు వై యాకయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కళ్లేపల్లి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమా రస్వామి, ఎం రామాచారి, జీ జ్యోతి, సీపెల్లి రవీందర్, తాండ్ర అంజయ్య, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.