Share News

Peddapalli: రూ.94.28 కోట్ల మద్యం అమ్మకాలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:36 PM

కోల్‌సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకా లతో డిసెంబర్‌లో భారీ ఆదాయం సమకూరింది. ఒక్క పెద్దపల్లి జిల్లాలో 98.28కోట్ల అమ్మకాలు జరిగాయి.

Peddapalli:  రూ.94.28 కోట్ల మద్యం అమ్మకాలు

- పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్‌ వేడుకలతో కిక్కు

- జిల్లాలో గత ఏడాది కంటే రూ.21.5కోట్ల అధికంగా అమ్మకాలు

- టార్గెట్లతో భారీ స్టాక్‌ను తెప్పించుకున్న వ్యాపారులు

కోల్‌సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకా లతో డిసెంబర్‌లో భారీ ఆదాయం సమకూరింది. ఒక్క పెద్దపల్లి జిల్లాలో 98.28కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే 21.5కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడయ్యింది. సర్పంచ్‌ ఎన్నికలు నూతనసంవత్సర వేడుకలతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది జిల్లాలో 72.78కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 74రిటైల్‌ షాపులు, 15బార్లు ఉన్నా యి. గతఏడాది డిసెంబర్‌లో 73వేల పెట్టెల ఐఎంఎల్‌(విస్కీ, బ్రాందీ), 99485పెట్టెల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి మూడు విడుతలుగా జరిగిన సర్పంచ్‌ ఎన్నికలు, నూతన సంవత్సరవేడుకలతో అమ్మకాలు భారీ గా పెరిగాయి. కాగాబీర్ల అమ్మకాలు మాత్రం పడిపోయాయి. 89117 పెట్టెల విస్కీ, బ్రాందీ అమ్మకాలు జరిగాయి. బీర్లుమాత్రం 85960పెట్టెలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. విస్కీ అమ్మకాల్లో గతఏడాదికంటే 16వేల 117పెట్టెలు అధికంగా అమ్ముడయ్యాయి. సుమారు 22శాతం అధికంగా విస్కీ అమ్ముడు పోయింది. కానీ బీర్లు మాత్రం గత ఏడాది కంటే 13525పెట్టెలు తక్కువగా అమ్ముడు పోయాయి. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువ రోజులు నమోదు అయిన ప్రభావం బీర్ల అమ్మకాలపై పడింది. జిల్లాలో సుమారు నెల రోజులుగా 10నుంచి 14డిగ్రీల మధ్య రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా బీర్ల అమ్మకాలు భారీగా తగ్గినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఎక్సైజ్‌శాఖకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో అధికారులు వ్యాపారులకు టార్గెట్లు పెట్టారు. దీంతో వ్యాపారులు కొత్త లైసెన్స్‌దారులు కావడంతో భారీస్టాక్‌ను అందుబాటులో ఉంచుకున్నారు. ఈ మాసంలోనే సమ్మక్క-సారలమ్మ జాతర ఉండడం, పౌర్ణమి తరువాత అమ్మ కాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ కంటే జనవరిలో మరో30శాతం అమ్మకాలు అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:36 PM