Peddapalli: రామగుండం మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేద్దాం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:26 AM
గోదావరిఖని, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రామ గుండం మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ పీఠంపై మరో మారు గులాబీజెండా ఎగుర వేసి, ఈ హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇదా ్దమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
- కోరుకంటి చందర్
గోదావరిఖని, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రామ గుండం మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ పీఠంపై మరో మారు గులాబీజెండా ఎగుర వేసి, ఈ హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇదా ్దమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో రామగుండం బీఆర్‌ఎస్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమా వేశంలో కోరుకంటి చందర్‌తోపాటు టీబీజీ కేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయ కులు కౌశిక హరి, మూల విజయరెడ్డి, గోపు అయులయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ రామ గుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులుంతా సైనికుల్లా పని చేయాలన్నారు. మన లక్ష్యం మేయర్ పీఠం అన్నారు. ప్రతి డివిజన్‌లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం శ్రేణులు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లా లని సూచించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్య ర్థులను భారీమెజారిటీతో గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్, కేసీఆర్‌పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా ఎంటో చూపుదామ న్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, నడిపెల్లి అభిషేక్ రావు, పీటీస్వామి అముల నారాయణ, పర్ల పల్లి రవి, నారాయణదాసు మారుతి, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, పెంట రాజేష్, తదితరులు పాల్గొన్నారు.