Peddapalli: రామగుండం నగరాన్ని స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:32 AM
కోల్‌సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు భాగస్వామ్యం కావా లని మేయర్ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు.
మేయర్ మహంకాళి స్వామి
కోల్‌సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు భాగస్వామ్యం కావా లని మేయర్ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంలో బుధవారం కళ్యాణ్‌నగర్‌లోని రాజస్థాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ రానున్నవర్షాకాలం దృష్ట్యా ఎలాంటి విపత్తులు జరుగకుండా అన్నివిభాగాలతో ముందస్తుగా సమన్వయం చేస్తున్నట్టు చెప్పారు. వేలాడుతున్న విద్యుత్‌తీగలు, శిథిలా వస్థలోఉన్న స్తంభాలగురించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ పాతపెల్లి ఎల్లయ్య, తహసీల్దార్ రవీందర్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, తదితరులున్నారు.
విలీన గ్రామాలకు నగరస్థాయి వసతులు
కోల్‌సిటీ : రామగుండం కార్పొరేషన్‌లో ఇటీవల విలీన మైన గ్రామాల్లో నగరస్థాయి వసతులు కల్పిస్తామని మేయర్ మహంకాళిస్వామి అన్నారు. బుధవారం 21వడివిజన్ ఎల్కల పల్లిగేట్, లక్ష్మీపురంలో కాలువపూడికతీత పనులను పరిశీలిం చారు. అనంతరం మాట్లాడుతూ విలీనమైన గ్రామాల్లో నీటి సరఫరా పైప్‌లైన్‌వేసి రక్షితమంచినీరు సరఫరాచేస్తామన్నారు.