Peddapalli: భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:25 AM
సుల్తానాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. భూముల రీసర్వేలో భాగంగా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దే వ్‌పల్లి గ్రామాన్ని జిల్లాయంత్రాంగం పైలట్‌ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి గ్రామంలో రీసర్వేపనులకు శ్రీకారం చుట్టారు. రెబ్బల్దే వ్‌పల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనఖీచేశారు. వాటిని పరిశీలించి అధికారు లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను ఖచ్చితత్వంతో నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదే శించారు. అనంతరం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని రెండవవార్డులో జరుగుతున్న సర్ కార్యక్రమంను తనిఖీచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బషీరొద్దిన్, కమిషనర్ రమేష్,బీఎల్‌వోమంజుల పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యఅందేలా చర్యలు చేపట్టాలి..
కమాన్‌పూర్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మంథనిలోని ప్రభుత్వడిగ్రీ, జూనియర్ కళాశాల లను తనిఖీచేశారు. అనంతరం కమాన్‌పూర్ మండ లంలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు. కళాశాలల్లో అదనపు మౌళికవసతులు అవసరమైతే ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో, పకడ్బందీగా నిర్వహిం చాలని అధికారులకు సూచించారు. ప్రతిబూత్‌స్థాయి అధికారి తమ పరిధిలోని ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని సక్రమంగా నింపడంలో అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఆయ నవెంట కమాన్‌పూర్ తహసీల్దార్ వాసంతి, ఏఈపీఆర్ జగదీష్, అధికారులు పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి..
మంథని/మంథనిరూరల్/ఎలిగేడు : సర్ ప్రక్రి యను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు. మంథనిపట్టణంలో, ఎలిగేడు మండ లంలోని శివపల్లి గ్రామంలో సర్‌ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి బీఎల్‌వో తనపరిధిలోని ప్రతిఓటర్‌కు ఎన్యుమరేషన్ ఫాంను అందించి, వాటిని తిరిగి సేకరించి గడువులోపు పూర్తి చేయాలన్నారు.