Peddapalli: నరకప్రాయంగా కుర్మపల్లి రహదారి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:39 AM
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి): ధర్మారం ఎక్స్‌రోడ్‌లోని స్టోన్ క్రషర్‌లతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని బుఽధవారం కుర్మపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.
- రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి): ధర్మారం ఎక్స్‌రోడ్‌లోని స్టోన్ క్రషర్‌లతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని బుఽధవారం కుర్మపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. కొంతకాలంగా రోడ్డుపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని, అధిక లోడ్‌లతో వెళ్తున్న వాహనాలతో రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని గ్రామస్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా రోడ్డుపై టెంట్‌వేసి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గొర్రె లింగయ్య, గుర్రాల లక్ష్మణ్, గ్రామ ఉపసర్పంచ్ అశోక్ మాట్లాడుతూ ఽధర్మారం ఎక్స్‌రోడ్ నుంచి ధర్మారం, రాజారంపల్లితో పాటు పలుగ్రామాలకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు. గతుకుల రోడ్డుతో తామంతా నిత్యంనరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. క్రషర్‌లనుంచి వచ్చే దుమ్ముతో కుర్మపల్లి గ్రామస్థులు రోగాలు బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. ఆందోళనచేస్తున్న స్థలా నికి పెద్దపల్లిరూరల్ ఎస్‌ఐ మల్లేష్ చేరుకొని గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలుపడంతో వారంతా ఆందోళన విరమించారు.